హిందీలో శివతాండవం చేస్తున్న 'దేవర'
కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం పోషించిన దేవర సినిమా సంచలన కలెక్షన్ల దిశగా దూసుకుపోతోంది. మొదటి రోజు నుంచి ఈ సినిమాపై వ్యతిరేక ప్రచారం జరుగుతున్నప్పటికీ దాన్ని తట్టుకొని ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మొదటి మూడు రోజులకే రూ.304 కోట్లు కొట్టగొట్టిని ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో కలుపుకొని రూ.350 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. దీనిపై నిర్మాతల నుంచి అధికారికంగా ధ్రువీకరణ రావాల్సి ఉంది. వచ్చేది దసరా సెలవులే కాబట్టి ఈ సినిమాకు అవన్నీ బోనస్ కాబోతున్నాయి.
రూ.50 కోట్లకు చేరువలో హిందీ వెర్షన్
ప్రధానంగా హిందీలో ఈ సినిమా శివ తాండవం చేస్తోంది. మొదటిరోజు కేవలం రూ.9 కోట్లు వసూలు చేయగా, రెండోరోజు రూ.12 కోట్లు వసూలు చేసింది. మూడోరోజు రూ.16 కోట్ల వరకు వసూలు చేసింది. మొత్తంగా హిందీ వెర్షన్ లో ఈ సినిమా రూ.50 కోట్లకు చేరువలో ఉంది. హిందీ ప్రేక్షకులకు ఈ సినిమా బాగా ఎక్కేసిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనికితోడు హిందీలో కరణ్ జోహార్ కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా బాగా కలిసివచ్చింది.

రూ.100 కోట్ల షేర్
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ కు దగ్గరగా వచ్చేసింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం లాభాల్లోకి అడుగుపెట్టింది. మరికొన్ని ప్రాంతాల్లో రెండురోజుల్లో లాభాలు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మొత్తం ఆరు రోజులకు నైజాంలో రూ.42 కోట్ల షేర్ సాధించింది. గుంటూరులో తొమ్మిదిన్నర కోట్ల రూపాయలకు చేరువలో ఉంది. త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.100 కోట్ల షేర్ ను దేవర అందుకుంటుందని, ఖాయమని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. సినిమా బాగున్నప్పటికీ వ్యతిరేక ప్రచారం ఎందుకు జరిగింది? దీనివెనక ఎవరు ఉన్నారు? అనే విషయంపై చిత్ర యూనిట్ పరిశోధనలో ఉంది. అందుకు కారకులైనవారెవరైనప్పటికీ వదిలేది లేదని నిర్మాతలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications