'దేవర'.. పార్ట్ 2 ప్రకటించిన డైరెక్టర్ కొరటాల
జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం దేవర. జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి కీలకమైన అప్ డేట్ ను ప్రకటించారు. దీనికి సంబంధించి డైరెక్టర్ కొరటాల శివ వీడియో విడుదల చేశారు.
దేవర కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసేది కావడంతో కథ విషయంలో తారక్ తో సహా అందరూ ఉద్వేగానికి గురైనట్లు తెలిపారు. ఈ సినిమాలో ఎన్నో బలమైన పాత్రలున్నాయని, షూటింగ్ జరుగుతున్న తర్వాత రోజురోజుకు పెద్దదైపోయిందని, కొన్ని షెడ్యూల్స్ షూటింగ్ ఔట్ పుట్ తో తమలో ఇంకా ఉత్సాహం కలిగిందన్నారు. నిడివిన దృష్టిలో ఉంచుకొని ఒక్క సన్నివేశంకానీ, ఒక్క సంభాషణ కానీ తొలగించలేని పరిస్థితి ఉందన్నారు. అన్నీ తొలగించలేమని తామంతా భావించినట్లు వెల్లడించారు. ఒక్క భాగంలోనే ఇంత పెద్ద కథను ముగించేయాలనుకోవడం కూడా తప్పే అన్న నిర్ణయానికి వచ్చామని, పాత్రలు, వాటి భావోద్వేగాలను పూర్తిస్థాయిలో చూపించాలంటే ఒక్క భాగంతో కుదరదని, అందరితో చర్చించి పార్ట్ 2 నిర్ణయం తీసుకున్నామన్నారు.

అభివృద్ధి చెందని ఓ తీర ప్రాంతం నేపథ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. తమకు భయం తెలియదంటూ విర్రవీగే వారికి భయాన్ని పరిచయం చేసే అత్యంత పవర్ ఫుల్ పాత్రలో తారక్ నటిస్తున్నారు. ఈ చిత్రంద్వారానే జాన్వీకపూర్ దక్షిణ చలనచిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తీశారు.












Click it and Unblock the Notifications