సంచలనం: పవన్ కల్యాణ్ స్థానంలోకి జూనియర్ ఎన్టీఆర్?
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రం చేస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీనే విడుదల కావాల్సి ఉంది. అయితే అనిరుధ్ రవిచందర్ స్వరాలందించడంలో ఆలస్యం కావడంతో ఈ ఏడాది విజయ దశమికి విడుదల చేయబోతున్నారు. ఆ తేదీకైనా విడుదలవుతుందా? అంటే కచ్చితంగా సినిమా యూనిట్ కూడా చెప్పలేకపోతోంది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నుంచి సినిమానే రాలేదు. ఇలాగే మరో రెండేళ్లు గడిస్తే తెలుగు ప్రేక్షకులకు తారక్ ను మర్చిపోతారంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
తొలి పాన్ ఇండియా చిత్రం
సుజిత్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ తొలిసారిగా ఓజీ చిత్రం చేస్తున్నారు. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పవన్ కల్యాణ్ మరో 15 రోజులు కాల్షీట్లు కేటాయిస్తే సినిమా పూర్తయిపోతోంది. ముంబయి గ్యాంగ్ వార్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని సుజిత్ తీర్చిదిద్దుతున్నాడు. అయితే ఈ సినిమా నిర్మాతల నుంచి సమస్యలు తలెత్తడం, బిజినెస్ విషయంలో సమస్యలు రావడం తదితర కారణాలతో ఈ ఏడాది సెప్టెంబరు 27వ తేదీన విడుదల కావాల్సివున్న ఈ సినిమాను వచ్చే ఏడాదికి వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

ఓజీకి బదులుగా దేవర?
పవన్ కల్యాణ్ తొలిసారిగా పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్న సినిమా ఇదే. చివరకు విడుదల ఆలస్యం కావడంతో ఆ తేదీన దేవర విడుదల చేయాలని ఆ చిత్ర యూనిట్ భావిస్తోంది. అక్టోబరు 10న విడుదల కావాల్సి ఉంది. అయితే సెప్టెంబరు 27వ తేదీకి మారితే అదనంగా మరో రెండువారాలు ఎటువంటి సినిమాతో పోటీపడాల్సిన అవసరం లేకుండా కలిసివస్తుందని చిత్రయూనిట్ భావిస్తోంది. దీంతో దేవర చిత్రాన్ని సెప్టెంబరు 27వ తేదీన విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా ధ్రువీకరణ రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications