హృతిక్ రోషన్‌కు జూనియర్ ఎన్టీఆర్ షాక్!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రం చేస్తున్నాడు. అనిరుధ్ రవిచందర్ స్వరాలందించడంలో ఆలస్యం జరగడంతో ఏప్రిల్ 5న కాకుండా విజయదశమికి విడుదల చేయబోతున్నారు. జాన్వీకపూర్ కథానాయిక. ఈ సినిమాను కరణ్ జోహార్ హిందీ బెల్టులో విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ హక్కులపై చిత్ర యూనిట్ తో ఒప్పందం కూడా కుదిరింది. తాజాగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్ తో కలిసి తారక్ వార్2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. వార్2 సెట్స్ మీదకు వెళ్లేందుకు ఆలస్యం అవుతుండటంతో మరో బాలీవుడ్ సినిమాను ప్రారంభించే యోచనలో తారక్ ఉన్నారు.
వార్2 కాకుండా బాలీవుడ్ లో తారక్ మరో సినిమా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. దేవర చిత్రాన్ని విడుదల చేస్తున్న కరణ్ జోహార్ బ్యానర్ లోనే ఈ సినిమా నిర్మితమవబోతోంది. మరో నిర్మాతగా కల్యాణ్ రామ్ వ్యవహరిస్తారు. వరుసపెట్టి బాలీవుడ్ చిత్రాలకు తారక్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటంతో తెలుగు పరిశ్రమకు దూరమవుతాడా? అంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఏ సినిమా అయినా ముందు తెలుగులోనే షూటింగ్ జరుపుకుంటుందని, సమాంతరంగా హిందీలో చిత్రీకరిస్తారని, వీలుకాకపోతే డబ్బింగ్ చేసి హిందీ బెల్టులో విడుదల చేస్తారని తారక్ సన్నిహితులు చెబుతున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా, గ్లోబల్ హీరోగా మారిన తారక్ బాలీవుడ్ లో రోజురోజుకు క్రేజ్ పెంచుకుంటున్నారు. తర్వాత చేసే సినిమాలకు సంబంధించి రెమ్యునరేషన్ విషయంలో కూడా సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడంటున్నారు. తాను నటించే ప్రతి సినిమా వైవిధ్యంగా ఉండేలా ఎన్టీఆర్ ప్లాన్ చేసుకుంటున్నారు. వార్2లో తారక్ పోషించబోయే రోల్ ఏమిటనేది తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే దీనిపై చిత్ర యూనిట్ ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. ఇండియన్ ఏజంట్ గా కనిపిస్తున్నాడని వార్తలు వస్తున్నాయికానీ వీటిని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications