అమెరికాలో అతి ఖరీదైన తెలుగువాడిగా జూనియర్ ఎన్టీఆర్?
అభిమానులు ముద్దుగా యంగ్ టైగర్ అని పిలుచుకునే జూనియర్ ఎన్టీఆర్ కాస్తా ప్రస్తుతం గ్లోబల్ హీరోగా మారిపోయారు. దీనికి కారణం రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా. ఈ సినిమాతో పాన్ ఇండియాతోపాటు అంతర్జాతీయంగానే పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలో కనపరిచిన అత్యుత్తమ నటన, పోషించిన నవరసాలు ఆయనకు ఆ పేరు తెచ్చిపెట్టాయి. సోలో హీరోగా సినిమా చేయడానికి ఆరు సంవత్సరాల సమయం తీసుకున్న తారక్ ఆ సమయంలో ఖాళీగా కూర్చోలేదు. తనదైన శైలిలో వ్యాపారాలు నిర్వహించారు.
అమెరికాలో భాగస్వామిగా వ్యాపారం
ఇండియాలో కూడబెట్టిన ఆస్తులతోపాటు జూనియర్ ఎన్టీఆర్ అమెరికాలో కూడా ఆస్తులను కొనుగోలు చేయడంతోపాటు వ్యాపారాలు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్, రెస్టారెంట్ తోపాటు పలురకాల ఫుడ్ ప్రొడక్ట్స్ కు సంబంధించిన వ్యాపారాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వాటి విలువ కూడా భారీస్థాయిలో ఉంటుందని తెలుస్తోంది. మనదేశంలో అయితే రూపాయిలతో కొలుస్తాం.. అదే అమెరికాలోని డాలర్ల రూపంలో ఉన్న ఆస్తులను రూపాయిల్లో కొలిస్తే అతి భారీగా ఉంటుందని తెలుస్తోంది. ఆయన వ్యాపారాలను చాలా నమ్మకస్తులైన వ్యక్తులు చూస్తున్నారు. అమెరికాలో వ్యాపారం చేస్తున్నవారితో భాగస్వామిగా కలిసి వ్యాపారం చేస్తున్నారు.

కొంతమందికి మాత్రమే తెలుసు
అమెరికాలో ఉన్నవారితోపాటు ఇండియా నుంచి కూడా మరో ముగ్గురు వెళ్లి వాటిని పర్యవేక్షిస్తున్నారు. వారెవరనేది అందరికీ తెలిసినవారే అయినప్పటికీ స్పష్టత లేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఆలోచనతో ఉన్న తారక్ తన తండ్రివైపు నుంచి వచ్చిన ఆస్తులు కాకుండా తనకు తాను సొంతంగా సంపాదించుకున్న సొమ్ముతోనే దాన్ని పెంపొందిస్తున్నారు. రూపాయికి రూపాయిని కలుపుతున్నారు. సినిమాకు రూ.100 నుంచి రూ.120 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్న తారక్ వాటిని రకరకాల వ్యాపారాల్లోకి మళ్లిస్తున్నారు. ఒక్క ఇండియాకు సంబంధించినంతవరకే తారక్ ఆస్తుల విలువ రూ.600 కోట్లకు పైగా ఉంటుందని ఓ ఫైనాన్షియల్ సంస్థ నివేదిక రూపొందించింది. అమెరికా సంగతి మాత్రం తారక్ మాత్రమే చెప్పాలి.












Click it and Unblock the Notifications