రూ.వెయ్యి కోట్ల నుంచి ప్రారంభం.. 'దేవర' లెక్క
కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం దేవర. పాన్ ఇండియా సినిమాగా రాబోతోంది. మొదటి భాగాన్ని ఈ ఏడాది విజయదశమికి విడుదల చేస్తున్నారు. అంచనాలు భారీగా ఉన్నాయి. ఆచార్య సినిమా పరాజయం పాలవడంతో కొరటాల ఎంతో కసితో దీన్ని నిర్మిస్తున్నారు. సినిమా ఫ్లాపైంది అనే విషయంకన్నా పలు వేడుకల్లో పరోక్షంగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలే కొరటాలలో కసిని పెంచాయని చెప్పొచ్చు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ బిజినెస్ ను మొదలు పెట్టింది.
నాన్ థియేట్రికల్ రైట్స్‌ను భారీ ధరలకు క్లోజ్ చేశారు. థియేట్రికల్ రైట్స్ ప్రాంతాలవారీగా పూర్తిచేసుకుంటూ వస్తున్నారు. తాజాగా బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ కరణ్ జోహార్ కి చెందిన 'ధర్మ ప్రొడక్షన్స్' తో కలిసి అనిల్ తడానీ ఏఏ ఫిలిమ్స్ ఈ సినిమాకు సంబంధించిన నార్త్ బెల్ట్ థియేట్రికల్ రైట్స్ ని సొంతం చేసుకున్నాయి. మొహమాటం కోసమో, స్నేహం కోసమో ఈ సంస్థలు వ్యాపారం చేసే సంస్థలు కావు. అవి ఫక్తు వ్యాపార సంస్థలు లాభం ఉంది అనుకుంటేనే రంగంలోకి దిగుతాయి.

దీనికన్నా ముందే అన్ని భాషలకు సంబంధించిన ఆడియో రైట్స్ ను టిసిరీస్ సొంతం చేసుకుంది. ఎంతకు అమ్ముడయ్యాయనే విషయం మాత్రం బయటకు రాలేదు. సంగీతాన్ని అందిస్తున్న అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే మ్యూజిక్ ఇస్తాడనే ఆశతో అభిమానులు ఉన్నారు. మ్యూజిక్ రైట్స్ ఎన్ని కోట్ల రూపాయలకు అమ్ముడు పోయాయనే విషయం కూడా ఎవరూ చెప్పలేకపోతున్నారు.
అంతటి భారీస్థాయిలో బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. ఓవర్సీస్ లో రూ.27 కోట్లకు హంసిని ఎంటర్ టైన్ మెంట్ సొంతం చేసుకుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పినట్లు ఈ ఏడాది దేవర నామ సంవత్సరంలానే కనిపిస్తోందంటున్నారు. టిల్లు స్క్వేర్ ఫంక్షన్ లో మాట్లాడుతూ డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై తారక్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.












Click it and Unblock the Notifications