Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అతిపెద్ద ఇండస్ట్రీ హిట్ వదులుకున్న జూనియర్ ఎన్టీఆర్

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ లో అనేక బ్లాక్ బస్టర్ సినిమాలు, ఇండస్ట్రీ హిట్ సినిమాలు చేశాడు. వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సమయంలో కొన్ని కథలు తనదగ్గరకు రాగా, డేట్లు ఖాళీ లేకపోవడంతో, మరికొన్ని కథలు నచ్చకపోవడంతో వదులుకోవాల్సి వచ్చింది. అయితే అవన్నీ సూపర్ హిట్ సినిమాలుగా మారాయి. అలాగే తనదగ్గరకు వచ్చిన ఓ కథను డేట్లు ఖాళీలేకపోవడంతో కొంచెం సమయం కావాలి.. తర్వాత చూద్దామని డైరెక్టర్ తో చెప్పాడు. అయితే ఆ దర్శకుడు అంత సమయం ఆగలేక వేరే హీరోతో తీసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఆ సినిమా వివరాలు తెలుసుకుందాం.

ఇప్పుడు కాదు.. తర్వాత చూద్దాం అన్నారు
కల్యాణ్ రామ్ కథానాయకుడిగా వచ్చిన చిత్రం అతనొక్కడే. ఇది అతి పెద్ద విజయాన్ని సాధించింది. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు. తర్వాత ఈ దర్శకుడికి అనేక అవకాశాలు వచ్చాయి. సురేందర్ రెడ్డి కూడా మంచి టాలెంట్ ఉన్న దర్శకుడిగా పేరుతెచ్చుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయాలని కథను రాసుకున్నారు. అదే కిక్ కథ. ఆ సినిమాను తారక్ తో తీస్తే బాగుంటుందని బాగా ప్రయత్నించాడు. అయితే వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో ఇప్పుడు కాదు.. కొంత సమయం కావాలి.. తర్వాత చూద్దామని తారక్ చెప్పాడు. దీంతో అంత సమయం అంటే బాగా ఎక్కువ సమయం పడుతుందనే ఉద్దేశంతో సురేందర్ రెడ్డి కథను రవితేజకు వినిపించి ఓకే చేయించుకున్నాడు.

junior ntr missed the block buster movie

అప్పట్లో దీన్ని ఇండస్ట్రీ హిట్ అన్నారు
సినిమా విడుదలైన తర్వాత అతి పెద్ద హిట్ సినిమాగా నిలిచింది. అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా దీన్ని భావించారు. సినిమా మొత్తం హాస్యం కొత్తపుంతలు తొక్కుతుంది. ఈ సినిమాను ఇప్పటికీ పదేపదే చూసేవారు కూడా ఉన్నారు. రవితేజ, బ్రహ్మానంద, అలీ కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలన్నీ సూపర్ హిట్. ఇదే సినిమాను తారక్ చేసివుంటే మరో రేంజ్ లో ఉండేదని, హాస్యాన్ని కూడా సూపర్ గా పండించేవాడని అభిప్రాయపడ్డారు. ఏదేమైనప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం మంచి సినిమాను వదులుకున్నాడంటూ అభిమానులు నిరుత్సాహపడ్డారు. ప్రస్తుతం వార్ 2 చేస్తున్న తారక్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 9వ తేదీన దీన్ని విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్ కొట్టాలనే లక్ష్యంతో తారక్ ఉన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+