జపాన్‌లో దుమ్ము రేపుతున్న ‘దేవర’
జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన దేవర చిత్రం గతేడాది విడుదలై మంచి విజయాన్ని దక్కించుకుంది. చిత్రానికి మిశ్రమ స్పందన లభించినప్పటికీ రూ.500 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టగలిగింది. కొరటాల శివ దర్శకత్వంలో నందమూరి కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. జాన్వీకపూర్ కథానాయికగా నటించింది. బాలీవుడ్ లో రూ.65 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా కొన్ని నెలలపాటు టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. పలు దేశాల్లోని ప్రేక్షకులంతా చూడటంతో ఈ రేటింగ్ సాధ్యమైంది.
ఆర్ఆర్ఆర్ ఏడాదిపాటు థియేటర్లలో ఆడింది
జపాన్ లో విపరీతమైన అభిమానులున్న జూనియర్ ఎన్టీఆర్ తన దేవరను కూడా అక్కడ విడుదల చేశారు. మార్చి 28వ తేదీన విడుదలైన ఈ సినిమా జపాన్ లో రికార్డు స్థాయి కలెక్షన్లను రాబడుతోంది అనేకన్నా దుమ్ము దులిపేస్తోందని చెప్పొచ్చు. సినిమా విడుదలకు ముందే మహిళా అభిమానులు తారక్ కటౌట్ కు పాలాభిషేకం నిర్వహించారు. విడుదలైనదగ్గర నుంచి కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. ఎందుకంటే ఎన్టీఆర్ గత చిత్రం ఆర్ఆర్ఆర్ అక్కడ ఏడాదిపాటు థియేటర్లలో ఆడి సంచలనం సృష్టించింది. మూడురోజుల్లోనే 15 మిలియన్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. మున్ముందు ఇంకా కలెక్షన్లు ఏ స్థాయిలో వస్తాయా? అని విశ్లేషకులు ఎదురుచూస్తున్నారు.

ఎన్ని రికార్డులను బీట్ చేస్తుందో చూడాలి
ఇంతకుముందు ఇక్కడ ప్రభాస్, రామ్ చరణ్ సినిమాలకు కూడా మంచి కలెక్షన్లు వచ్చాయికానీ వాటన్నింటినీ జపాన్ లో దేవర తుడిచిపెట్టేసేలా ఉంది. ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి చేస్తున్న వార్2 సినిమాను కూడా నిర్మాతలు జపాన్ లో విడుదల చేయాలనే యోచనలో ఉన్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత అంతర్జాతీయ హీరో అయిపోయిన తారక్ తో సినిమాలు తీసేందుకు దర్శకులు, నటించేందుకు హీరోయిన్లు పోటీపడుతున్నారు. వార్2 తర్వాత ప్రశాంత్ నీల్ తో డ్రాగన్, ఆ తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ తో మరో సినిమా చేయనున్నాడు. ఎన్టీఆర్ సినిమాలన్నింటినీ వరుసగా జపాన్ లో విడుదల చేయాలనే ఉద్దేశంలో నిర్మాతలు ఉన్నారు. అక్కడ తారక్ కు మంచి మార్కెట్ ఉండటం కూడా బాగా కలిసివస్తోంది. రాబోయే రోజుల్లో జపాన్ లో దేవర ఎన్ని రికార్డులు కొల్లగొడుతుందో చూడాలి.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..!












Click it and Unblock the Notifications