'దేవర' టీజర్ రివ్యూ: విధ్వంసమే
ఆర్.ఆర్.ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా 'దేవర'. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవర టీజర్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. చిత్రబృందం కూడా టీజర్ బాగా వచ్చిందని, త్వరలోనే విడుదల చేస్తున్నామంటూ ప్రకటించింది.
దేవర టీజర్ వచ్చేసింది. మొత్తం 80 సెకన్లు ఉంది. ఈ టీజర్ లో జూనియర్ ఎన్టీఆర్ విధ్వంసం కనిపించింది. సముద్రాన్ని చూపించారు. ఆ సముద్రంలో ఓడ.. దానిపైకి దొంగలు దాడిచేయడం.. వారిపై తారక్ పోరాటం.. ఇదీ దేవర టీజర్ లో కనిపించిన ప్రధానమైన విషయాలు. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ ఓ ఇంగ్లిషు పాటతో జిస్ట్ మొత్తం చెప్పడానికి ప్రయత్నించాడు. అతని ఆర్ఆర్ ఎప్పటిలాగానే చాలా పవర్ ఫుల్ గా ఉంది.

ఇంత విధ్వంసం ఉన్నా తారక్ నోటి నుంచి ఒక డైలాగ్ కూడా వినాలిగా. అందుకే చివర్లో ఎన్టీఆర్ ఈ సముద్రం చేపల కంటే, రక్తాన్నే ఎక్కువ చూసింది. అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారు అంటూ ఓ డైలాగ్ పలికాడు. విజువల్ గా ఈ సినిమా చాలా రిచ్‌గా కనిపించింది. యాక్షన్‌కి పెద్ద పీట వేశారు. సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనింగ్ చాలా బాగుంది. 2024 వేసవి 'దేవర'దే అని నమ్ముతున్న వాళ్లకు ఈ టీజర్ ఉత్సాహాన్ని కలిగిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
అందరూ పాన్ ఇండియా హీరోలవుతుంటే ఆర్ఆర్ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ హీరోగా మారిపోయారు. దానితర్వాత చేస్తున్న సినిమా దేవర. దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని కొరటాల శివ దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఆచార్య ఫ్లాప్ అవడంతో అతను మరింత కసిగా, సినిమాను బ్లాక్ బస్టర్ చేయాలనే లక్ష్యంతో దీన్ని నిర్మిస్తున్నట్లు అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications