వార్ 2 కోసం ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ రెమ్యునరేషన్
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ తన హవాను చూపిస్తోంది. తెలుగు పరిశ్రమలో ఉన్న స్టార్ కథానాయకులంతా జాగ్రత్తగా కథలను వింటూ, సినిమా హిట్ అవడానికి అవకాశం ఉన్న స్క్రిప్ట్ లను ఎంచుకుంటూ సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే దాదాపుగా అందరూ పాన్ ఇండియా హీరోలుగా మారిపోయారు. తెలుగు, తమిళం, మళయాళం, కన్నడం, హిందీ, గుజరాతీ, మరాఠీ అనే భేదం లేకుండా దేశవ్యాప్తంగా తెలుగు హీరోలు తమ సత్తా చాటుతున్నారు. వారి సినిమాల కోసమే హిందీ బెల్టులోని ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇటువంటి క్రమంలోనే ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా, గ్లోబల్ హీరోగా మారిపోయిన తారక్ అనూహ్యంగా వార్ 2 చిత్రం చేస్తున్నారు. అన్ని భాషల్లో ఉన్న దర్శకులుకానీ, హీరోలుకానీ తెలుగు నటులు లేకుండా సినిమాలు చేయడానికి సాహసించడంలేదు. అంతగా బలమైన ముద్ర వేశారు తెలుగు హీరోలు, దర్శకులు. ప్రస్తుతం హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కథానాయకులుగా వార్ 2 రూపుదిద్దుకుంటోంది. దేవర సినిమాతో భారీ సక్సెస్ ను, అవసరమైతే ఇండస్ట్రీ హిట్ ను కొట్టాలనే కసితో తారక్ ఉన్నాడు.

వార్2 సినిమా కోసం తారక్ 50 రోజులు కాల్షీట్లు కేటాయించారు. రోజుకు రూ.2 కోట్ల చొప్పున రూ.100 కోట్లను పారితోషికంగా తీసుకుంటున్నారు. తెలుగు వారిని కూడా తమ సినిమాల్లో కచ్చితంగా భాగస్వాములను చేస్తేనే హిట్లు కొడతామనే భావనకు బాలీవుడ్ మేకర్లు వచ్చారు. దీంతో ప్రతి భారీ ప్రాజెక్టులో తెలుగు హీరోలను చేరుస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ అడిగినంత ఇచ్చి తనతో నటింపచేస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందనే విషయంలో స్పష్టత లేకపోయినప్పటికీ నటన పరంగా ఎన్టీఆర్ ఒక మెట్టు అధిరోహిస్తాడని చెప్పొచ్చు. ఈ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా తారక్ స్టామినా ఏమిటనేది తెలిసివస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. సినిమా కూడా ఒక రేంజ్ లోనే ఉండబోతోందంటున్నారు.












Click it and Unblock the Notifications