అల్లు అర్జున్ పై జూనియర్ ఎన్టీఆర్ సెటైర్లు?
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రాన్ని పూర్తిచేశారు. పాన్ ఇండియా సినిమాగా ఈనెల 27వ తేదీన దేశవ్యాప్తంగా విడుదల కాబోతోంది. జాన్వీకపూర్ కథానాయిక కాగా, సైఫ్ అలీఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ లాంటి సీనియర్లు నటించారు. అనిరుధ్ రవిచందర్ స్వరాలందించారు. ఆరు సంవత్సరాల తర్వాత తారక్ సోలో హీరోగా నటిస్తున్న చిత్రం కావడంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. వాటిని ఎంతవరకు అందుకుంటారో చూడాలి. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
విజయ్ డ్యాన్స్ నచ్చుతుంది
ప్రమోషన్లలో భాగంగా ఇటీవలే చెన్నైలో జూనియర్ ఎన్టీఆర్ ఇంటర్వ్యూ ఇచ్చారు. తమిళంలో తనకు దళపతి విజయ్ డ్యాన్స్ అంటే బాగా నచ్చుతుందన్నారు. కొంతమంది డ్యాన్స్ అంటే సర్కస్ ఫీట్లు చేయడమే అని ఈమధ్య భావిస్తున్నారన్నారు. అలాంటివారు తనకు నచ్చరని, విజయ్ మాత్రం డ్యాన్స్ ను ఎంజాయ్ చేస్తూ చేస్తారన్నారు. ఆయన డ్యాన్స్ వేస్తే పెద్దగా శ్రమపడినట్లు కూడా అనిపించదన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. విజయ్ మంచి డ్యాన్సరే అయినప్పటికీ తారక్, రామ్ చరణ్, అల్లు అర్జున్ అంత డ్యాన్సర్లు మాత్రం కాదని అందరూ ఒప్పుకుంటారు.

సర్కస్ ఫీట్లు చేయడం అనుకుంటున్నారు
ఈమధ్య డ్యాన్స్ చేయడం అంటే సర్కస్ ఫీట్లు చేయడం అనుకుంటున్నారని తారక్ అన్నాడు. ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశాడని అభిమానులు సోషల్ మీడియాలో చర్చ పెట్టారు. గతంలో అల్లు అర్జున్ డ్యాన్స్ అలాగే ఉండేది. విభిన్నమైన స్టెప్స్ వేశేవాడు. ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు అల్లు అర్జున్ ను ఉద్దేశించే అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
దళపతి విజయ్ తన తెలుగు హీరోల సినిమాలను తమిళంలో రీమేక్ చేసేవాడు. అంతేకాదు.. తెలుగులో మన హీరోలు వేసిన స్టెప్పులను కూడా వేసేవాడు. అయితే మన హీరోలు వేసినంతబాగా మాత్రం వేయలేకపోయేవాడు. అయితే విజయ్ లాంటి డ్యాన్సర్ తారక్ కు ఎలా నచ్చాడో అంటున్నారు నెటిజన్లు.












Click it and Unblock the Notifications