జూనియర్ ఎన్టీఆర్ ను టార్గెట్ చేసిన డైరెక్టర్?

ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ హీరోగా మారిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రం చేస్తున్నారు. తారక్ ఎనర్జీని మ్యాచ్ చేసే హీరో ఉండరు అంటే అతిశయోక్తి కాదు. తారక్ సెటల్ లో ఉంటేనే ఎంతో హడావిడి ఉంటుంది. ఈ విషయాన్ని దర్శకులే స్వయంగా చెబుతుంటారు. అలాగే తనతో సినిమా తీసిన ప్రతి డైరెక్టర్ కు ఎన్టీఆర్ నిక్ నేమ్ పెడతారు. దీనికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దర్శకులు వ్యవహరించే విధానాన్ని బట్టి, వారు పనిచేసే తీరునుబట్టి ఎన్టీఆర్ పేరు పెడుతుంటాడు. అందులో భాగంగానే బాల రామాయణం చేసే సమయంలో డైరెక్టర్ గుణశేఖర్ ను నిక్ నేమ్ తో పిలుస్తుండేవాడట. ఈ సినిమా షూటింగ్ జరుపుకునే సమయానికి తారక్ వయసు కేవలం 10 సంవత్సరాలు మాత్రమే. చిన్నతనంలోనే చైల్డ్ ఆర్టిస్టుగా పరిశ్రమలోకి ప్రవేశించిన ఎన్టీఆర్ ఈ సినిమాతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే గుణశేఖర్ మాత్రం షూటింగ్ జరిగే సమయంలో తారక్ ను బెదిరించి మరీ యాక్టింగ్ చేయించుకున్నాడు. చాలా సందర్భాల్లో తారక్ స్వయంగా ఈ విషయాన్ని చెప్పాడు.

junior ntr target to director gunasekhar

ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ కు మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత హీరోగా అవకాశాలు రావడానికి ఇది మొదటి మెట్టుగా ఉపయోగపడింది. షూటింగ్ టైంలో తనను ఇబ్బంది పెట్టినందుకు గుణశేఖర్ కు తారక్ కటకటాల రుద్రయ్య అనే నిక్ నేమ్ తో పిలుస్తుండేవాడు. స్టార్ హీరోగా మారిన తర్వాత తారక్ ఒక్కసారి కూడా గుణశేఖర్ దర్శకత్వంలో సినిమా చేయలేదు. కథలు నచ్చలేదా? లేదంటే అవకాశాలు వచ్చినప్పటికీ వేరు వేరు షెడ్యూల్స్ లో ఉండటంవల్ల కుదర్లేదా? అనేది వారికే తెలియాలి. వీరిద్దరి దర్శకత్వంలో ఓ మంచి సినిమా పడుంటే సూపర్ గా ఉండేదని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం దేవర తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+