Tillu Square: టిల్లు స్క్వేర్ టీంకు పార్టీ ఇచ్చిన ఎన్టీఆర్..!

ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కాలమైనా.. డీజే టిల్లు తో సిద్ధు జొన్నలగడ్డ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మూవీ 2022లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు దానికి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని మల్లిక్‌ రామ్ తెరకెక్కించారు. మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన టిల్లు స్క్వేర్ కూడా ఘన విజయం సాధించింది. డీజే టిల్లు లాగా ఈ సినిమాలో కూడా మంచి కామెడీ ఉంది.

వసూళ్ల పరంగా కూడా టిల్లు స్క్వేర్ మంచి ఊపు మీద ఉంది. మొదటి రోజు ఈ చిత్రం భారీగా వసూలు చేసింది. నైజాంలో రూ.8 కోట్లు, సీడెడ్ లో 3 కోట్లు, మిగతా ప్రాంతాల్లో రూ.11 కోట్లు రాబట్టింది. ఇండియాలోని మిగతా ప్రాంతాలతో పాటు ఓవర్సీస్ లో కలిపి ఈ మూవీ రూ.27 కోట్లు వసూలు చేసింది. 5 రోజుల్లో టిల్లు స్క్వేర్ చిత్రం రూ. 83 కోట్లు గ్రాస్ రాబట్టింది. టిల్లు స్క్వేర్ విజయం పట్ల సినీ ప్రముఖులు సిద్ధు జొన్నలగడ్డను అభినందిస్తున్నారు.

Junior NTR threw a party for Tillu Square team

తాజాగా జూనియర్ ఎన్టీఆర్ టిల్లు స్క్వేర్ టీంను అభినందించారు. ఈ మూవీ విజయం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఎన్టీఆర్.. టీంకు పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి నిర్మాత నాగ వంశీ, సిద్ధు జొన్నలగడ్డ, హీరో విశ్వక్ సేన్ హాజరయ్యారు. వీరంతా కలిసి తీసుకున్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టిల్లు స్క్వేర్ చిత్రంపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. చిత్ర యూనిట్ ను తన ఇంటికి పిలిపించుకున్న చిరు వారిని అభినందించారు.

టిల్లు స్క్వేర్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలిసింది. ఈ మూవీకి 13 నుంచి 15 కోట్ల వరకు చెల్లించినట్లు చెప్పుకుంటున్నారు. టిల్లు స్క్వేర్ ఓటీటీ ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో ఇంకా ప్రకటించలేదు.

ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం తెలుస్తోంది. ఈ నెంబర్స్ చూస్తేనే సినిమా బ్రేక్ ఈవెన్ పాయింట్ ను దగ్గరగా చేరినట్లు అర్థమవుతుంది. మరోవైపు బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల పరంగా సినిమా భారీ కలెక్షన్లను రాబడుతోంది. చూడాలి మరి మరోసారి డీజే టిల్లు ఏ రేంజ్ లో ప్రేక్షకులను ర్యాంపేజ్ ఆడుతాడో

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+