జూనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన పవన్‌కల్యాణ్ సినిమా
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం హిందీలో వార్2 చేస్తున్నారు. దీనికి అయాన్ ముఖర్జీ దర్శకుడు. యష్ రాజ్ ఫిలింస్ పతాకంపై ఆదిత్య చోప్రా దీన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన విడుదల కాబోతోంది. దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. హిందీలో మార్కెట్ ను విస్త్రతం చేసుకోవాలని భావిస్తున్న ఎన్టీఆర్ తెలుగు సినిమాలతోపాటు నేరుగా హిందీ సినిమాల్లో కూడా నటించాలని నిర్ణయించుకున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేయనున్నాడు. దీనికి సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి. షూటింగ్ ప్రారంభించడమే తరువాయి. రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 9వ తేదీన విడుదల చేయబోతున్నారు.
ఈ ఏడాది ఆ రెండూ విడుదల కాబోతున్నాయి
అలాగే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. తన పనితీరుతో అధికారులను హడలెత్తిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోను అవినీతి పరులను వదిలిపెట్టేది లేదని, వైసీపీ హయాంలో అక్రమాలకు పాల్పడినవారి వివరాలు సేకరిస్తున్నామని, తప్పు చేసినవారంతా రాజకీయ నాయకులైనా, అధికారులైనా, ఉద్యోగులైనా శిక్ష అనుభవించి తీరాల్చిందే అని స్పష్టం చేస్తున్నారు. పిఠాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పవన్ కల్యాణ్ అక్కడే సొంత ఇంటిని నిర్మించుకున్నారు. ఆయన నటించిన హరిహరవీరమల్లు సినిమా మార్చి 28న విడుదల కాబోతోంది. దీనితర్వాత సెప్టెంబరులో ఓజీ సినిమాను విడుదల చేస్తారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ ఉంటుందా? ఉండదా? అనేది తేలాల్సి ఉంది.

తనకు ఆ సినిమా అంటే ఎంతో ఇష్టం
జూనియర్ ఎన్టీఆర్ పలు సందర్భాల్లో తనకు బాగా ఇష్టమైన పవన్ కల్యాణ్ సినిమా తొలిప్రేమ అని చెప్పేవారు. చాలాసార్లు ఆ సినిమా చూశానని, అదంటే తనకెంతో ఇష్టమని చెప్పేవారు. పవన్ కల్యాణ్ తొలిప్రేమ, ఖుషి, సుస్వాగతం లాంటి ప్రేమకథా సినిమాలు చేసే సమయంలో తారక్ మాస్ హీరోగా ఉన్నారు. మాస్ ఇమేజ్ తో ఉండే హీరోకు అటువంటి ప్రేమ కథలు కూడా చేయాలని ఉంటుందికానీ అభిమానులు, ప్రేక్షకులు అంగీకరిస్తారా? లేదా? అనే డైలమాలో ఉండి ఈ తరహా చిత్రాలకు దూరంగా ఉంటారు. ఎన్టీఆర్ కు తొలిప్రేమ అంటే బాగా ఇష్టమని చెప్పడంతో పవన్ కల్యాణ్ అభిమానులు ఖుషీగా ఉన్నారు. స్వచ్ఛమైన ప్రేమకథతో రూపొందిన ఈ సినిమా సంచలన విజయం సాధించి ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది.
-
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
'పెద్ది' సినిమా వాయిదా..? నిర్మాత సంచలన ప్రకటన.. -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
సింగర్ గానే షేక్ చేసేసింది.. డాన్సర్‌గా అంటే థియేటర్స్ తగలబడడమే !! -
దద్దరిల్లిన "BB జోడీ".. గ్రాండ్ ఫినాలేలో పర్ఫామెన్స్ పూనకాలే.. విన్నర్స్ వాళ్లే ?? -
ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్.. కానీ బిలియనీర్‌గా రాజభోగాలు -
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..!












Click it and Unblock the Notifications