650 రోజుల నుంచి ఒకే థియేటర్‌లో ఆడుతున్న జూనియర్ ఎన్టీఆర్ సినిమా

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'దేవర' చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతోపాటు హిందీలో, కన్నడంలో సూపర్ హిట్ గా నిలిచింది. తమిళనాడు, కేరళలో సోసోగా అనిపించుకుంది. సుమారు ఆరు సంవత్సరాల తర్వాత తారక్ సోలో హీరోగా చేసిన సినిమా ఇది. ఈ సినిమాకు మూడున్నర సంవత్సరాలకు ముందు 'ఆర్ఆర్ఆర్' చేశారు. ఇందులో ఎన్టీఆర్ తోపాటు రామ్ చరణ్ కూడా నటించారు. మల్టీస్టారర్ గా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా 2022 మార్చిలో మనదేశంతోపాటు విదేశాల్లో కూడా విడుదలైంది.

అయితే జపాన్ లో మాత్రం ఆలస్యంగా విడుదల చేశారు. 2022 అక్టోబరు 22న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు థియేటర్లలో ఏకధాటిగా ప్రదర్శింపబడుతోంది. విడుదలైనప్పటి నుంచి ఈ సినిమా ఇప్పటివరకు ఆడుతూనే ఉందని అది ప్రదర్శింపబడుతున్న థియేటర్ యాజమాన్యం ట్వీట్ చేసింది. మరో వారం రోజులు నడిపించి తర్వాత సినిమాను తీసేస్తున్నట్లు తెలిపింది. థియేటర్ లో మరోసారి ఈ సినిమాను చూడాలనుకునేవారు క్యూ కడుతున్నారు. జపాన్ లో విడుదలై రెండు సంవత్సరాలవుతున్నప్పటికీ, తర్వాత ఓటీటీలో, కేబుల్ లో, టీవీల్లో వచ్చినప్పటికీ అక్కడి ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాను చూస్తూనే ఉన్నారు.

Junior NTR s RRR movie is playing in the same theater since 650 days

నాటకానికి ముఖ్యఅతిథిగా వెళ్లిన రాజమౌళి
వారికి అంత బాగా ఈ సినిమా నచ్చింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ ను రాత్రికి రాత్రే స్టార్లుగా ఈ సినిమా అక్కడ మార్చేసింది. తర్వాత ఆ సినిమా అభిమానులు 'ఆర్ఆర్ఆర్' ను ఒక నాటకంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజమౌళి హాజరయ్యారు. థియేటర్లలో సినిమా నెలరోజులు ఆడటమే గగనమవుతున్న రోజుల్లో 650 రోజుల నుంచి ఆడటం అంటే సాధారణ విషయమేం కాదు. ఆ సినిమాను అక్కడి ప్రేక్షకులు అంత బాగా ఆదరిస్తున్నారు. సొంత గడ్డ అయిన భారతదేశంలోనే వంద రోజులు ఆడటం కష్టమైంది. సినిమా విడుదలైన కొన్నిరోజుల తర్వాత ఓటీటీల్లోకి వస్తుండటంతో థియేటర్లపై ప్రభావం పడుతోంది. ఓటీటీల నుంచి భారీ ఆఫర్లు వస్తుండటంతో నిర్మాతలు కూడా అందుకు ఒప్పుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+