'కాకా' లో నా క్యారెక్టర్ పేరు ఇదే.. మెగాస్టార్ మరో లీక్.. ఫ్యాన్స్ కు పూనకాలే..
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఏడు పదుల వయసులోనూ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్నారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన మన శంకర్ వర ప్రసాద్ మూవీ థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. దాదాపు రూ. 300 కోట్లకు పైగా రాబట్టి మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. అంతేకాక రీజినల్ ఇండస్ట్రీ హిట్ గానూ ఈ మూవీ నిలిచింది. ఈ మూవీ ఇచ్చిన ఉత్సాహంతో ఇప్పుడు బాబీ దర్శకత్వంలో కాకా అనే మూవీ చేస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

ఇటీవల మెగాస్టార్ బర్త్ డే కానుకగా ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ లో స్టైల్, మాస్ ఎలిమెంట్స్ తో చిరంజీవి మెప్పించారు. దాంతో ఈ టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. కాకా చిత్రానికి థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. అలాగే సినిమాటోగ్రఫర్ గా విజయ్ కార్తీక్ కన్నన్, ఎడిటర్ గా ఆంటోనీ ఎల్. రూబెన్ వ్యవహరిస్తున్నారు. ఇక కాకా మూవీలో అనస్వరా రాజన్, నివేదా థామస్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
కాకా… కదిరి కాళిదాస్ ❤️🔥❤️🔥❤️🔥#KAAKA - JAN 13th Sankranthi 2027🔥#KAAKAOnJan13 pic.twitter.com/tfaa5Nmadk
— Kaaka (@KaakaMovie) September 20, 2026
అయితే కాకా మూవీలో తన క్యారెక్టర్ ను మెగాస్టార్ చిరంజీవి మరోసారి లీక్ చేశారు. తన సినిమాల గురించి ఇప్పటికే అనేకసార్లు మెగాస్టార్ చిరంజీవి లీక్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల ఓ ఈవెంట్ లో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి కాకా లో తన పాత్ర పేరు కదిరి కాళిదాస్ అని వెల్లడించారు. దాంతో అక్కడ ఉన్న ఫ్యాన్స్ ఈలలు చప్పట్లతో కేరింతలు కొట్టారు. అయితే చిరంజీవి తెలిపిన వివరాల ప్రకారం ఈ మూవీలో మెగాస్టార్ రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం. ఒకటి సత్యం పాత్రలో ఒక సాధారణ ఆక్వా ఫ్యాక్టరీలో పనిచేసే సూపర్ వైజర్ కాగా.. మరో పాత్రలో చీకటి ప్రపంచాన్ని శాసించే కదిరి కాళిదాస్ అనే అండర్ వరల్డ్ డాన్ ఉన్నట్లు స్పష్టం అవుతోంది. అయితే దీనిపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.












Click it and Unblock the Notifications
