కాకా.. టపాసులు సంక్రాంతికి కాల్చుకుందాం
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ.. కాకా. మాస్ చిత్రాల దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్నాడు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కే నారాయణ ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. దీపావళి పండగను పురస్కరించుకుని ఓ పవర్ఫుల్ అండ్ రగ్గడ్ పోస్టర్‌ను విడుదల చేసింది.. యూనిట్. ఊర మాస్ లుక్ లో కనిపించాడు మెగాస్టార్.. ఈ పోస్టర్ లో. కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ మాస్ లుక్ అది.
వర్షం పడుతోండగా పొలాల మధ్య బురద అంటిన తడి దుస్తులు, చెదిరిన జుట్టు, గడ్డంతో దర్శనం ఇచ్చాడు మెగాస్టార్. ఇది అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆయన చేతిలో రక్తం మరకలు అంటిన కత్తిపీట ఉండటం సినిమా కథా నేపథ్యంపై మరింత ఆసక్తిని పెంచుతోంది. 'టపాసులు సంక్రాంతికి కాల్చుదాం..' అంటూ వచ్చే జనవరి నాటి పొంగల్ పండుగ సంబరాలకు ఇప్పటి నుంచే పిలుపునిచ్చారు దర్శక నిర్మాతలు.

ఈ భారీ యాక్షన్ డ్రామాలో చిరంజీవి 'కదిరి కాళిదాస్' అనే పవర్ ఫుల్ రోల్ ను పోషిస్తోన్నాడు. హై ఓల్టేజ్ యాక్షన్ మాత్రమే కాకుండా కట్టిపడేసే కుటుంబ భావోద్వేగాలు కూడా ఈ కథలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, వర్సటైల్ నటుడు అనురాగ్ కశ్యప్ ఇందులో విలన్ క్యారెక్టర్ లో నటిస్తోన్నాడు. నివేథా పేతురాజ్, అనస్వర రాజన్, గెటప్ శ్రీను ఇతర పాత్రలను పోషిస్తోన్నారు.
HAPPY DIWALI EVERYONE 💥Tapasulu SANKRANTHIKI Kaaludham 😎🧨🔥#KAAKA - JAN 13th Sankranthi 2027❤️🔥 #KAAKAOnJan13 https://t.co/7gBT2PJbwO
— Kaaka (@KaakaMovie) November 8, 2026
గతంలో చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్లో వచ్చిన వాల్తేరు వీరయ్య చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఆ సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తూ ఈ కాకాను కూడా 2027 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు స్పష్టం చేశారు. మెగాస్టార్ మాస్ బాడీ లాంగ్వేజ్‌కు తగినట్లుగా బాబీ రూపొందించిన అంశాలు థియేటర్లలో ప్రేక్షకులతో ఈలలు వేయించేలా ఉంటాయని ఫిల్మ్ నగర్ టాక్.












Click it and Unblock the Notifications
