గంటకు 60 వేలకు పైగా టికెట్లు తెగుతున్నయ్.. 3 రోజుల్లో రూ. 400 కోట్లు..!
ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ఒకటిగా 'రామాయణ పార్ట్ 1' మూవీ నిలిచిన సంగతి తెలిసిందే. అయితే దీపావళి కానుకగా నవంబర్ 5 న విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తోంది. తొలి రోజు నుంచే నార్త్ సౌత్ అని తేడా లేకుండా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తొలి రోజు రూ. 155 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ ను ఎక్స్ లో పోస్టు చేశారు.
ఒక్క భారత్ లోనే ఈ మూవీ రూ. 64. 85 కోట్లకు పైగా నెట్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇక రెండో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.102 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన 'రామాయణ' మూవీ.. మూడో రోజు ఏకంగా రూ.145 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ కలెక్షన్స్ లో హిందీ వెర్షన్ ఒక్కటే రూ.50 కోట్లకు పైగా నెట్ సాధించింది. సౌత్ డబ్బింగ్ వెర్షన్ల నుంచి దాదాపు రూ.20 కోట్ల నెట్ వచ్చినట్లు సమాచారం అందుతోంది. మొత్తంగా చూస్తే మూడు రోజుల్లో రామాయణ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 375.50 కోట్లు దాటినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రస్తుతం ప్రముఖ ఆన్ లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్ అయిన బుక్ మై షో లో గంటకు దాదాపు 60 వేల టికెట్స్ బుకింగ్ అవుతున్నాయి. ఇక ఇతర బుకింగ్ యాప్స్ అయిన డిస్ట్రిక్ట్, టికెట్ న్యూ తో పాటు థియేటర్లలో కొనుగోలు చేస్తున్న టికెట్లను కలిపితే ఆ సంఖ్య మరింత రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద హల్ చల్ చేస్తున్న రామాయణ మూవీ రానున్న రోజుల్లో ఇంకెన్ని రికార్డుల్ని అధిగమిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

ఇక రామాయణ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ శ్రీ రాముడిగా నటించారు. అలాగే సీతాదేవి గా సాయి పల్లవి నటించింది. ఇక రాకింగ్ స్టార్ యష్ రావణాసురుడిగా నటించారు. మరోవైపు సన్నీ డియోల్ హనుమాన్ పాత్రలో మెప్పించనున్నారు. లక్ష్మణుడిగా రవి దూబే నటించారు. ఈ మూవీని దంగల్ ఫేమ్ నితీష్ తివారీ తెరకెక్కించారు. నమిత్ మల్హోత్రా, యష్ కలిసి సంయుక్తంగా నిర్మించారు.












Click it and Unblock the Notifications
