కాజల్ అగర్వాల్ ఆ హీరోతో ప్రేమలో పడిందా..?
కాజల్ అగర్వాల్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లక్ష్మీ కల్యాణం మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది కాజల్. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేస్తుంటూ స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకుంది. రామ్ చరణ్- రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన మగధీర సినిమాతో కాజల్ స్టార్ హీరోయిన్‌గా మారింది. ఎన్టీఆర్ , మహేష్ బాబు , ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది.
ఇక చిరంజీవి, బాలకృష్ణ వంటి సీనియర్ హీరోల సరసన కూడా నటించింది. తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో టాప్ హీరోయిన్‌గా వెలిగిన కాజల్ గౌతమ్ కిచ్లు అనే ప్రముఖ బిజినేస్ మ్యాన్‌తో ప్రేమాయణం సాగించింది. గౌతమ్ కిచ్లుతో రిలేషన్‌షిప్‌లో కొనసాగించిన కాజల్ అతన్ని వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కాజల్ హవా కాస్తా తగ్గిందనే చెప్పాలి. ఇదే సమయంలో కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీకి పరిచియం రావడంతో కాజల్‌కు అవకాశాలు తగ్గాయి.

ఇక కాజల్ గర్భవతి కావడం బాబుకు జన్మనివ్వడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇదిలా ఉంటే కాజల్ అగర్వాల్ ఓ తెలుగు హీరోను గతంలో ప్రేమించారనే వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ ముద్దుగుమ్మ అప్పట్లో నటుడు దగ్గుబాటి రానాతో ప్రేమలో పడిందనే వార్తలు వినిపించాయి. ఇక రానా, కాజల్ అగర్వాల్ కాంబినేషన్లో నేనే రాజు నేనే మంత్రి అనే సినిమా వచ్చింది.
అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో దగ్గుబాటి రానా, కాజల్‌ల మధ్య మంచి కెమిస్ట్రీ ఏర్పడి ఇద్దరు ప్రేమలో పడ్డారనే టాక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టింది. అయితే ఇందులో ఎటువంటి వాస్తవం లేదని తర్వాత తేలింది. గౌతమ్ కిచ్లుతో చాలా ఏళ్ల నుంచి ప్రేమలో ఉన్న కాజల్ , తన బంధాన్ని పెళ్లిగా మార్చుకున్నారు. ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కాజల్ బాలకృష్ణ హీరోగా వచ్చిన 'భగవంత్ కేసరి' మూవీలో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది.












Click it and Unblock the Notifications