బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌తో రొమాన్స్ చేసిన ఏకైక తెలుగు హీరోయిన్
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తిరుగులేని ఫామ్‌లో ఉన్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో వరుస హ్యాట్రిక్ కొట్టి ప్రస్తుతం తన 109వ సినిమాను కొల్లి బాబీ దర్శకత్వంలో చేస్తున్నారు. సంక్రాంతికి విడుదలవుతుందా? లేదా? అనే విషయంలో స్పష్టత రాలేదు. సితార బ్యానరుపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. తమన్ స్వరాలందిస్తున్నారు. అన్ స్టాప్ బుల్ 4 సీజన్ ప్రారంభమైంది. సూర్య, అల్లు అర్జున్, దుల్కర్ సల్మాన్ లాంటి హీరోలను ఇంటర్వ్యూలు చేస్తున్నారు. 109వ సినిమా పూర్తయిన తర్వాత బోయపాటి శ్రీనుతో మరో సినిమా ప్రారంభం కాబోతోంది.
బాలయ్య, కల్యాణ్ రామ్ తో చేసింది
సీనియర్ హీరోలకు హీరోయిన్ల కొరత వేధిస్తున్న క్రమంలో తాజాగా కాజల్ అగర్వాల్ మంచి ఆప్షన్ గా దర్శకులు భావిస్తున్నారు. దీంతో అనిల్ రావిపూడి భగవంత్ కేసరి చిత్రంలో బాలయ్య సరసన కాజల్ ను నటింప చేశాడు. నందమూరి బాలయ్యతో కాజల్ తొలిసారిగా సినిమా చేసింది. దీనికి ముందు మరో ఇద్దరు నందమూరి హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తో కూడా నటించింది. తాను తెలుగులో కెరీర్ ప్రారంభించడమే కల్యాణ్ రామ్ సరసన తేజ దర్శకత్వంలో లక్ష్మీ కల్యాణం సినిమాతో ప్రారంభించింది. ఆ తర్వాత ఇదే హీరోతో ఎమ్మెల్యే అని మరో సినిమాలో నటించింది. మొదటి సినిమా పర్వాలేదుకానీ ఎమ్మెల్యే మాత్రం ఫ్లాప్ అయింది.

తారక్ తో రెండు సినిమాలు చేసింది
జూనియర్ ఎన్టీఆర్ తో బృందావనం, టెంపర్ సినిమాల్లో నటించింది. ఇలా ముగ్గురు నందమూరి హీరోలతో కెరీర్ లో సినిమా చేసి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. అంతకుముందు మెగా హీరోలైన చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ సరసన కూడా నటించడంతోపాటు చిరు మేనల్లుడు అల్లు అర్జున్ తో కూడా నటించింది. ఇలా తెలుగు సినీ పరిశ్రమలో రెండు పెద్ద కుటుంబాలకు చెందిన హీరోల సరసన నటించి అరుదైన రికార్డును కాజల్ అగర్వాల్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం తెలుగులో సీనియర్ హీరోల సరసన నటిస్తోంది. వివాహమైన తర్వాత కూడా తనకు సినిమాల్లో అవకాశాలు రావడం అదృష్టమనే చెప్పాలి. చందమామ సినిమా కాజల్ సినీ కెరీర్ ను మలుపు తిప్పింది.












Click it and Unblock the Notifications