నేనింకా చిన్న పిల్లనే.. ఆ హీరోతో చేయనని చెప్పా.. ఓపెన్ అయిన శ్రీదేవి
ఇండస్ట్రీలో గుర్తింపు రావాలంటే చాలా ఏళ్లు పడుతుంది. పదుల సంఖ్యలో సినిమాలు చేస్తేనే ఆడియన్స్ గుర్తిస్తారు. కానీ కాకినాడ శ్రీదేవి మాత్రం చేసిన ఒక్క సినిమాతోనే ఫుల్ క్రేజ్ కొట్టేసిందీ బ్యూటీ. కాకినాడ శ్రీదేవి అంటే ఎవరూ గుర్తుపట్టరేమో గానీ.. కోర్టు మూవీ జాబిలి అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. కోర్టు మూవీతో తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది కాకినాడ శ్రీదేవి.
కోర్టు ఈ మూవీలో తన నటనతో యువతను ఆకట్టుకుంది శ్రీదేవి. ఈ మూవీలో హీరోగా హర్ష్ రోషన్ నటించాడు. ఈ చిత్రానికి రామ్ జగదీష్ దర్శకత్వం వహించగా.. ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ ఏడాది మార్చిలో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. యువ నటీనటులతో పాటు ప్రముఖ నటులు ప్రియదర్శి, సాయి కుమార్ కీలక పాత్రల్లో నటించారు.

అయితే తాజాగా కాకినాడ శ్రీదేవి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ లో చాలా ఆఫర్స్ వస్తున్నట్లు పేర్కొంది. ఎక్కువగా కాలేజీ లవ్ స్టోరీస్, యూత్ మూవీస్ లో ఆఫర్స్ వస్తున్నట్లు.. ఒకరిద్దరూ తెలుగు యంగ్ హీరోల నటించాలంటూ కూడా ఆఫర్స్ వచ్చాయని తెలిపింది. కానీ తనకు ఇప్పుడే అలాంటి సినిమాల్లో నటించాలని లేదని.. యాక్టింగ్ పై పూర్తి స్థాయిలో పట్టు సాధించాక చాలా రకాల పాత్రల్లో నటించాలని ఉందని తెలిపింది. హీరోయిన్ అయ్యేందుకే ఇండస్ట్రీలోకి వచ్చినట్లు తెలిపింది కాకినాడ శ్రీదేవి.
రీసెంట్ గా తమిళంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది శ్రీదేవి. ఈ మూవీ ఇటీవల ప్రారంభం అయింది. కేజేఆర్ హీరోగా.. కొత్త సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. మినీ స్టూడియో బ్యానర్ పై రెగన్ స్టానిస్లాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.












Click it and Unblock the Notifications