ఓటు హక్కు లేకపోయినా ఆ హీరో కోసం అలా చేశా.. సీక్రెట్ విప్పిన శ్రీదేవి

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ కాకినాడ శ్రీదేవి.. ఒక్క సినిమాతోనే ఫుల్ క్రేజ్ కొట్టేసింది. కాకినాడ శ్రీదేవి అంటే ఎవరూ గుర్తుపట్టరేమో గానీ.. కోర్టు మూవీ జాబిలి అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. ఈ మూవీతో తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది శ్రీదేవి. ముఖ్యంగా ఈ మూవీలో తన అమాయకమైన నటనతో యువతను ఆకట్టుకుంది శ్రీదేవి. ఈ మూవీలో హీరోగా హర్ష్ రోషన్ నటించాడు. ఈ చిత్రానికి రామ్ జగదీష్ దర్శకత్వం వహించాడు. ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ ఏడాది మార్చిలో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. దీంతో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.

Kakinada Sridevi Court Movie Heroine Expresses Deep Admiration for Pawan Kalyan

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో కాకినాడ శ్రీదేవి తన ఫేవరేట్ హీరో ఎవరో చెప్పేసింది. ఆయన ఎవరో కాదు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. హైప్ కోసం చెప్పట్లేదని.. ఆయనంటే చచ్చేంత ఇష్టం అని చెప్పుకొచ్చింది. కానీ ఎందుకు ఇష్టం అంటే మాత్రం తెలియదని.. పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి రాకముందు నుంచి ఇష్టమని తెలిపింది. ఆయనతో సినిమా చేయాలని ఉంది.. కానీ నటనలో నైపుణ్యం సాధించాక ఆయనతో మంచి పాత్రలో నటిస్తానని తెలిపింది. త్వరలో పవన్ కల్యాణ్ ను కలుసుకోబోతున్నానని శ్రీదేవి తెలిపింది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఆశీస్సులు తీసుకున్నానని.. త్వరలో పవన్ కల్యాణ్ ను కలిసి బ్లెసింగ్స్ తీసకుంటానని చెప్పుకొచ్చింది.

అంతేకాక గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పార్టీ విజయం కోసం తన వంతు కృషి చేశానని .. తనకు ఓటు హక్కు లేకపోయినా తెలిసిన వాళ్ల అందరితో జనసేన పార్టీకి ఓట్లు వేయించానని చెప్పుకొచ్చింది. అంతేకాక కాకినాడలో అధికంగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఉంటారని కాకినాడ శ్రీదేవి చెప్పింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం ఆమె ఓ తమిళ్ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ ఇటీవల ప్రారంభం అయింది. కేజేఆర్ హీరోగా.. కొత్త సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. మినీ స్టూడియో బ్యానర్ పై రెగన్ స్టానిస్లాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+