బాక్సాఫీస్ దుమ్ము దులిపిన ప్రభాస్.. కేవలం రెండు రోజుల్లోనే అన్ని వందల కోట్లా..?
బాక్సాఫీస్ వద్ద కల్కి సినిమా దూసుకుపోతుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి సినిమాలో ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించారు. గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో దీపికా పదుకొనే, అమితాబ్, కమల్ హాసన్ వంటి స్టార్స్ నటించారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ వంటి సెలబ్రిటీలు ముఖ్య పాత్రల్లో కనిపించారు. పురాణాలకు, కలియుగాంతానికి, కల్కి అవతారానికి లింక్ చేస్తూ డైరెక్టర్ నాగ్ అశ్విన్ అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించారు.
కురుక్షేత్ర యుద్ధం జరిగిన ఆరు వేల సంవత్సరాల తర్వాత భూమి మొత్తం నాశనం అవుతుంది. ఆ తర్వాత భూమి మీద ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో అనేది కల్కి కథ. హాలీవుడ్ రేంజ్ విజువల్స్ చూసి అడియన్స్ ఆశ్చర్యపోయారు. ఈ సినిమా హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కించారు.సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా కంటెంట్, విజువల్స్, వీఎఫ్ఎక్స్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ విజన్‌కు ఆడియన్స్ ఫిదా అవుతూ అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

రూ. 600 కోట్ల భారీ బడ్జెట్‌తో తెకకెక్కిన ఈ సినిమాను పెద్ద ఎత్తున రిలీజ్ చేశారు. ఈక్రమంలో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కుమ్మేసింది. కల్కి మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్లతో బాక్సాఫీస్‌ను దుమ్ము దులిపేసింది. మొదటి రోజు (గురువారం) రూ. 191.5 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం, రెండో రోజు (శుక్రవారం) రూ. 107 కోట్లు వసూలు చేసింది. రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల మార్క్ తెలుగు సినిమా సత్తాను మరోసారి చాటింది. అయితే, మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు వసూళ్లు కొంచెం తగ్గాయి. వీకెండ్‌లో మరో రెండు రోజులు ఉండటంతో, ఈ చిత్రం మొదటి వారంలోనే భారీ వసూళ్లు చేసే అవకాశం ఉంది.
ముఖ్య ప్రాంతాల వారీగా:
ప్రపంచవ్యాప్తంగా: రూ. 298.5 కోట్లు గ్రాస్, రూ.150 కోట్లు షేర్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్: రూ.168 కోట్లు
కర్నాటక: రూ.25 కోట్లు
తమిళనాడు: రూ.16 కోట్లు
కేరళ: రూ.6 కోట్లు
నార్త్: రూ.85 కోట్లు
ఓవర్సీస్: రూ.70 కోట్లు












Click it and Unblock the Notifications