ఆ సినిమా దరిదాపుల్లో లేని 'కల్కి'

ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వచ్చిన పాన్‌ ఇండియా మూవీ 'కల్కి '. తాజాగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో దీపికా పదుకొనే, అమితాబ్, కమల్ హాసన్ వంటి స్టార్స్ నటించారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ వంటి సెలబ్రిటీలు ముఖ్య పాత్రల్లో కనిపించారు.

పురాణాలకు, కలియుగాంతానికి, కల్కి అవతారానికి లింక్ చేస్తూ డైరెక్టర్ నాగ్ అశ్విన్ అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించారు. కురుక్షేత్ర యుద్ధం జరిగిన ఆరు వేల సంవత్సరాల తర్వాత భూమి మొత్తం నాశనం అవుతుంది. ఆ తర్వాత భూమి మీద ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో అనేది కల్కి కథ. హాలీవుడ్ రేంజ్ విజువల్స్ చూసి అడియన్స్ ఆశ్చర్యపోయారు.ఈ సినిమా హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కించారు

Kalki 2898 AD Day 1 Box Office Collection

.సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా కంటెంట్, విజువల్స్, వీఎఫ్ఎక్స్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ విజన్‌కు ఆడియన్స్ ఫిదా అవుతూ అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. రూ. 600 కోట్ల భారీ బడ్జెట్‌తో తెకకెక్కిన ఈ సినిమాను పెద్ద ఎత్తున రిలీజ్ చేశారు. దీంతో సినిమా కలెక్షన్లు కుమ్మేయడం ఖాయమనుకున్నారంతా. కల్కి మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్లతో బాక్సాఫీస్‌ను దుమ్ము దులిపేసింది.

ప్రపంచవ్యాప్తంగా, ఈ సినిమా ₹191.5 కోట్లకు పైగా వసూలు చేసి, అనేక రికార్డులను బద్దలు కొట్టింది. తెలుగులోనే ఈ సినిమా రూ. 135 కోట్లకు పైగా వసూలు చేసి, టాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు చేసిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది.

కల్కి ఫస్ట్ డే కలెక్షన్స్:
తెలుగు: ₹135 కోట్లు +
తమిళం: ₹25 కోట్లు +
హిందీ: ₹15 కోట్లు +
కన్నడ: ₹10 కోట్లు +
మలయాళం: ₹6 కోట్లు +
ఈ కలెక్షన్లు సాధించి అనేక రికార్డులను బ్రేక్ చేసింది.

అయితే బాహుబలి -2 రికార్డులను బ్రేక్ చేయడంలో కల్కి ఫెయిల్ అయింది. బాహుబలి-2 తొలిరోజు ₹250 కోట్లు కలెక్ట్ చేసి మొదటి స్థానంలో ఉండగా, కల్కి సినిమా ₹191.5 కోట్లు వసూలు చేసి రెండో స్థానంలో నిలిచింది. తాజాగా చిత్ర నిర్మాత కల్కి తొలిరోజు కలెక్షన్స్‌ను ఆఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+