Kalki 2898 AD.. విడుదల తేదీ లాక్
Prabhas: యంగ్ రెబెల్ స్టార్ నటిస్తోన్న తాజా సినిమా కల్కి 2898 ఏడీ. ఈ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్‌కు నాగ్ అశ్విన్ దర్శకుడు. వైజయంతి మూవీస్ పతాకంపై సీ అశ్వినీదత్ ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో చిత్రీకరణ జరుపుకొంటోందీ పాన్ ఇండియా మూవీ.
ప్రభాస్ సరసన దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తోంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశాపటానీ.. కీలక పాత్రల్లో నటిస్తోన్నారు. అవెంజర్స్ తరహాలో హాలీవుడ్ రేంజ్‌లో ఉండబోతోంది ఈ సైంటిఫిక్ థ్రిల్లర్. దీనిపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో ప్రభాస్ రేంజ్ హాలీవుడ్ స్థాయికి చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

ప్రస్తుతం సలార్ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోన్నారు ప్రభాస్. 700 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది సలార్ పార్ట్-1 సీస్ ఫైర్. ఇక కల్కి 2898 ఏడీ కోసం సెట్స్‌పైకి వెళ్లారు. దీనితో పాటు మారుతి దర్శకత్వాన్ని వహించనున్న సినిమాను కూడా ఏకకాలంలో పూర్తి చేయాలనే ఉద్దేశంలో ఉన్నారాయాన.
ఈ పరిస్థితుల్లో కల్కి 2898 ఏడీ రిలీజ్ డేటా లాక్ అయింది. ఈ సమ్మర్ సీజన్‌లో ఈ సినిమా విడుదల కానుంది. మే 9వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌కు బాగా అచ్చొచ్చిన తేదీ ఇది. గతంలో మెగాస్టార్ చిరంజీవి- శ్రీదేవి కాంబినేషన్‌లో వచ్చిన జగదేక వీరుడు- అతిలోక సుందరి ఇదే తేదీన విడుదలైంది. 1990 మే 9వ తేదీన ఈ మూవీ విడుదలైంది.
కల్కి 2898 AD.. విడుదల తేదీ లాక్..!!#Prabhas #DeepikaPadukone #AmitabhBachchan #VyjayanthiMovies #Kalki2898AD #Kalki2898ADOnMay9th #Oneindiatelugu pic.twitter.com/6C2Xb8LPuf
— oneindiatelugu (@oneindiatelugu) January 12, 2024
అప్పటివరకు ఉన్న బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ చెరిపేసింది. వైజయంతి మూవీస్ బ్యానర్‌లోనే నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన మహానటి కూడా 2018 మే 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదే సెంటిమెంట్‌ను కల్కికి కూడా వర్తింపజేశారు నిర్మాత అశ్వినీదత్.












Click it and Unblock the Notifications