ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఒంటరిగా కల్యాణ్ రామ్- జూనియర్ ఎందుకు రాలేదు?

నేడు- తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 30వ వర్ధంతి. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఘనంగా నివాళులు అర్పిస్తోన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పలు సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు సామాజిక సేవా కార్యక్రమాలు జరుగనున్నాయి. వీటికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.

హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన మనవడు, నటుడు కల్యాణ్ రామ్ నివాళి అర్పించాడు. ఈ తెల్లవారు జామునే ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకున్నాడు. నేరుగా సమాధి వద్దకు చేరుకుని నివాళి అర్పించాడు. సమాధికి ప్రదక్షిణలు చేశాడు. కొద్దిసేపు మౌనం పాటించాడు. సమాధి వద్దే కూర్చుని తాతయ్యను స్మరించుకున్నాడు.

Kalyan Ram pays homage to NTR on 30th death anniversary at NTR Ghat

తాతయ్య వర్ధంతి నాడు ఎప్పుడు ఘాట్ వద్దకు వచ్చినా తన సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి వచ్చేవాడు కల్యాణ్ రామ్. ఈ సారి ఒంటరిగా రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం తన కొత్త సినిమా షూటింగ్ కోసం జోర్డాన్ వెళ్లడమే దీనికి కారణమని తెలుస్తోంది.

కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియన్ హైబడ్జెట్ మూవీ ఇది. వార్ 2 తర్వాత ఎన్టీఆర్ నుంచి రాబోతోన్న నెక్స్ట్ సినిమా ఇదే. ఇందులో కొన్ని కీలక సన్నివేశాలను జోర్డాన్ లో చిత్రీకరించనున్నారు. ఫిల్మ్ సిటీలో కొన్ని సన్నివేశాలను తీశారు. ఇప్పుడు జోర్డాన్ వెళ్లినట్లు చెబుతున్నారు. అందుకే తాతయ్యకు నివాళి అర్పించడానికి జూనియర్ ఎన్టీఆర్.. ఘాట్ వద్దకు రాలేదని సమాచారం.

కాగా కల్యాణ్‌రామ్‌ను చూడటానికి భారీ సంఖ్యలో అభిమానులు పెద్ద ఎత్తున ఘాట్ వద్దకు చేరుకున్నారు. ఘాట్ వద్ద రద్దీ నెలకొంది. అనంతరం అభిమానులు సీనియర్ ఎన్టీఆర్‌కు నివాళి అర్పించారు. ఎన్టీఆర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. పలువురు ప్రముఖులు ఘాట్ వద్దకు రావాల్సి ఉన్నందున బందోబస్తు ఏర్పాటు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+