ఎన్టీఆర్‌కు సలహా ఇస్తానా ?.. కళ్యాణ్ రామ్ షాకింగ్ కామెంట్స్

నందమూరి హీరోలు, అన్నదమ్ములు కళ్యాణ్ రామ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ రామలక్షణులు లాగా ఎంత బాగా కలిసి ఉంటారో అందరికీ తెలిసిందే. నందమూరి కుటుంబంలో బాబాయ్ - అబ్బాయిల మధ్య గ్యాప్ వచ్చిందని గత కొంతకాలంగా ఓపెన్ గానే డిస్కషన్ నడుస్తోంది. అప్పుడెప్పుడే బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ సందర్భంగా ఈవెంట్ లో కలసి కనిపించారు. మళ్లీ ఆ తర్వాత నుంచి బాలయ్య - ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కలిసి కనిపించలేదు. కుటుంబానికి సంబంధించిన కార్యక్రమాల్లో సైతం ఎడమొహం, పెడమొహం గానే ఉంటున్నారు. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ మాత్రం కలిసి కనిపిస్తూ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఎన్టీఆర్ గురించి కళ్యాణ్ రామ్ చేసిన కామెంట్స్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే ఆర్ఆర్ఆర్ చిత్రాల్లో బాడీ మేకోవర్ అదరగొట్టిన ఈ హీరో ఇటీవల కొంతకాలంగా బక్కచిక్కి కనిపిస్తున్నారు. మ్యాడ్‌ స్క్వేర్‌ సక్సెస్‌ మీట్‌లో, కళ్యాణ్‌ రామ్‌ 'అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి' సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో సన్నగా కనిపించారు ఎన్టీఆర్. దీంతో మా హీరోకి ఏమైంది అంటూ ఆయన అభిమానులు తెగ ఫీల్ అయిపోతున్నారు. ఉన్నట్టుండి ఇలా అయిపోవడానికి కారణం ఏంటి ? అనారోగ్య సమస్యలా అంటూ సందేహాలను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో సైతం పోస్టులు పెడుతున్నారు.

kalyan-ram-shocking-comments-on-jr-ntr-health

ఈ క్రమంలోనే కళ్యాణ్‌ రామ్‌ తన 'అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి'మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో దీని గురించి ఓపెన్ అయ్యారు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో కళ్యాణ్‌ రామ్‌ను ఎన్టీఆర్‌ ఆరోగ్యంపై ప్రశ్నించారు. ఆయన ఎందుకు అంతలా సన్నబడ్డారు? మీరేమైన సలహా ఇచ్చారా? అని అడిగారు. అందుకు సమాధానం చెబుతూ.. ప్రస్తుతం తారక్‌ ఓ సూపర్‌ స్టార్‌.. తన మార్కెట్‌ పాన్‌ ఇండియా స్థాయికి చేరిందన్నారు. దేశంలోనే అగ్ర దర్శకులతో కలిసి పని చేస్తున్నాడని.. ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌తో ఓ సినిమా చేస్తున్నాడన్నారు. వాళ్లిద్దరికి తాను సలహాలు, సూచనలు ఇస్తానా? అంటూ చెప్పుకొచ్చారు. తారక్‌ ఏం చేసిన అది సినిమా కోసమేనని.. సినిమాకు మంచి అవుట్‌ ఇవ్వడానికి.. అభిమానులను అలరించేందుకు తాము ఏమైనా చేస్తాం.. ఎంత దూరమైన వెళతామని స్పష్టం చేశారు.

దీంతో ప్రశాంత్‌ నీల్‌ సినిమా కోసం తారక్‌ సన్నబడ్డారని కళ్యాణ్‌ రామ్‌ పరోక్షంగా హింట్‌ ఇచ్చేసినట్టు అభిమానులు చెబుతున్నారు. రీసెంట్ గానే నీల్ - ఎన్టీఆర్ సినిమా తొలి షెడ్యూల్‌ని హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభించారు. ఇక ఏప్రిల్‌ 22 నుంచి జరిగే సెకండ్‌ షెడ్యూల్‌ లో ఎన్టీఆర్‌ పాల్గొంటారని మూవీ యూనిట్ అప్డేట్ ఇచ్చింది. చూడాలి మరీ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ని ఏ విధంగా చూపించబోతున్నారో అని.

మరోవైపు హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 చిత్రంలో నటిస్తున్నారు ఎన్టీఆర్. అయ‌న్ ముఖ‌ర్జీ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ 'వార్' సినిమాకు సీక్వెల్‌గా వ‌స్తుంది. ఆదిత్య చోప్రా నిర్మిస్తుండ‌గా.. ప్రస్తుతం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని భావిస్తునారు. ఈ సినిమా తారక్‌ బాలీవుడ్‌ డెబ్యూ చిత్రం కావడంలో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+