బీజేపీ బడ్జెట్‌పై స్టార్ హీరో సెటైర్లు
2024-25 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలల కాలానికి వార్షిక బడ్జెట్‌ను మంగళవారం పార్లమెంట్‌లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. వికసిత్ భారత్ లక్ష్యంగా 3.0 బడ్జెట్‌ను తయారు చేశామని నిర్మలా సీతారామన్ చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతోందని, ద్రవ్యోల్బణం తగ్గుతోందని ఆమె తెలిపారు. బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు అధిక స్థాయిలో కేటాయింపులు దక్కాయి.
Congratulations on a NDA budget, hope to have a INDIA Budget soon.#Budget2024
— Kamal Haasan (@ikamalhaasan) July 23, 2024
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక నిధులతో పాటు అమరావతికి 15 వేల కోట్లు (అప్పుల రూపంలో) మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ప్రత్యేక సందర్భాల్లో మరిన్ని నిధులు మంజూరు చేస్తామని తెలిపారు.బహుపాక్షిక అభివృద్ధి సంస్థల సహాయం ద్వారా బీహార్‌కు ప్రభుత్వానికి ఆర్థిక సహాయాన్ని ఏర్పాటు చేస్తుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. అయితే కేంద్ర బడ్జెట్‌పై స్టార్ హీరో, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ స్పందించారు.

ఎన్డీఏ బడ్జెట్‌పై కమల్ హాసన్ సెటైర్లు వేశారు.ఎన్డీఏ బడ్జెట్‌కు శుభాకాంక్షలు , త్వరలోనే ఇండియా బడ్జెట్ వస్తుందని ఆశిస్తున్నా అని ఆయన ట్వీట్ చేశారు. బడ్జెట్‌కు వ్యతిరేకంగా కమల్ హాసన్ ట్వీట్ చేయడంతో, ఆయనపై నెటిజన్లు భిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. కమల్ హాసన్‌కు బడ్జెట్ అర్థం కాలేదనుకుంటా అని కొందరు కామెంట్స్ చేస్తుంటే, మరికొందరు ఇండియాన్ 2 బడ్జెట్ ఏమైందో చెప్పాలంటూ కమల్ హాసన్‌కు కౌంటరిస్తున్నారు. ప్రస్తుతం కమల్ హాసన్ బడ్జెట్ గురించి చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications