'థగ్ లైఫ్' రివ్యూ.. కమల్ హాసన్ సినిమా ఎలా ఉందంటే..?
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కమల్ హాసన్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఆయన నుంచి వచ్చిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో ఆయన చేసిన 'థగ్ లైఫ్' సినిమా జూన్ 5, 2025న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో ఒకసారి చూద్దాం.
కథ:
ఈ సినిమా కథ విషయానికి వస్తే, రంగరాయ శక్తివేల్ (కమల్ హాసన్) మాఫియా సామ్రాజ్యాన్ని ఏలుతూ ఉంటాడు. అతనికి పోటీగా మాణిక్యం తన వ్యాపారాలను కొనసాగిస్తూ ఉంటాడు. ఒకరోజు మాణిక్యం రంగరాయ శక్తివేల్‌పై కాల్పులు జరపగా, అమరన్ (శింబు) అనే యువకుడు అతన్ని కాపాడుతాడు. రంగరాయ ఆ కుర్రాడిని తన సొంత కొడుకులా భావించి పెంచుకుంటాడు. కాలక్రమేణా, రంగరాయకు, అమరన్‌కు మధ్య విభేదాలు తలెత్తి, ఒకరినొకరు చంపుకునేంత శత్రుత్వాన్ని పెంచుకుంటారు. ఈ క్రమంలో వీళ్లిద్దరి మధ్య ఏం జరిగింది, ఎవరు ఎవరిని చంపారు అనే విషయం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
ఒకప్పుడు టాప్ డైరెక్టర్‌గా మంచి గుర్తింపును సంపాదించుకున్న మణిరత్నం ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలతో ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోతున్నారు. 'పొన్నియన్ సెల్వన్' మొదటి, రెండో భాగాల విషయంలోనూ తెలుగు ప్రేక్షకులకు ఇదే అనుభవం ఎదురైంది. 'థగ్ లైఫ్'లో మణిరత్నం కమల్ హాసన్‌ను విభిన్నంగా చూపించే ప్రయత్నం చేశారు. కమల్ హాసన్ తన నటనతో ఒక అద్భుతమైన శక్తిగా కనిపించారు. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన 'నాయకుడు' సినిమాను మించి ఈ సినిమాలో కమల్ హాసన్ నటన ఉందని చెప్పొచ్చు.
మణిరత్నం ఫస్టాఫ్ ఎంగేజింగ్‌గా హ్యాండిల్ చేసినప్పటికీ, సెకండ్ హాఫ్‌కు వచ్చేసరికి కొంత తడబడినట్లు తెలుస్తోంది. సినిమాను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే విషయంలో ఆయన కొంతవరకు క్లారిటీ మిస్ అయినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. శింబు క్యారెక్టర్‌ను తీర్చిదిద్దిన విధానం బాగున్నప్పటికీ, ఇతర సినిమాల్లో చూసిన పాత్రల మాదిరిగానే అతనికి రొటీన్ స్టోరీని పెట్టడం వల్ల ఈ సినిమాపై పెద్దగా కొత్తదనం లేకుండా పోయింది. మణిరత్నం-కమల్ హాసన్ కాంబినేషన్ మీద ప్రేక్షకులకు మంచి అంచనాలు ఉండటంతో, ఆ అంచనాలకు రీచ్ అయ్యే విధంగా ఈ సినిమా లేకపోవడం, కొంత కన్ఫ్యూజన్‌తో కూడిన స్క్రీన్ ప్లే ఉండటం ఈ సినిమాకు మైనస్‌గా మారాయి. మాఫియా సామ్రాజ్యాన్ని చాలా బాగా ఎస్టాబ్లిష్ చేసినప్పటికీ, అందులోని పాత్రలను సరిగ్గా డీల్ చేయలేకపోవడం ఈ సినిమాకు భారీ మైనస్ అని చెప్పాలి. రెహమాన్ మ్యూజిక్ కూడా సోసోగానే ఉంది. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో కొంతవరకు కేర్ తీసుకున్నప్పటికీ, సినిమాలోని కోర్ ఎమోషన్‌ను పండించడంలో రెహమాన్ తన బ్యాక్‌గ్రౌండ్‌తో కొంతవరకు మాత్రమే సహకరించాడని చెప్పాలి.

ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్:
లోకనాయకుడు కమల్ హాసన్ తన గత చిత్రాల మాదిరిగానే అద్భుతమైన ప్రదర్శనను కనబరిచారు. ఆయన నటన కోసమైనా ఈ సినిమా చూడొచ్చు అనేంత రేంజ్‌లో నటించి మెప్పించారు. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో వచ్చే కొన్ని సీన్స్‌లో ఆయన అద్భుతంగా నటించారు. శింబు కూడా తన పాత్ర పరిధి మేరకు చాలా అద్భుతంగా నటించారు. ఒకానొక సందర్భంలో కమల్ హాసన్‌తో పోటీపడి మరీ నటించి తన పరిణితిని చూపించారు. త్రిష కూడా సినిమా స్టోరీలో భాగం కావడం, ఆమె పాత్రకు మంచి స్కోప్ ఉండటం వల్ల ఆమె కూడా సినిమాలో హైలైట్‌గా నిలిచింది. అభిరామి పాత్ర కూడా చాలా బాగుంది. మిగతా ఆర్టిస్టులందరూ తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు.
టెక్నికల్ అంశాలు:
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే, ఏ.ఆర్. రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కొన్ని సీన్స్‌లో ఆయన ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు చాలా బాగా హెల్ప్ అయింది. క్లైమాక్స్‌లో ఆయన ఇచ్చిన వయోలిన్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది. సినిమాటోగ్రఫీ కూడా ఈ సినిమాకు చాలా బాగా హెల్ప్ అయింది. మణిరత్నం సినిమా అంటే సినిమాటోగ్రఫీ బాగుంటుంది, విజువల్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి అనే విషయం మనకు తెలిసిందే. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో కూడా చాలా ఎక్స్‌ట్రాడినరీ విజువల్స్‌ను స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేశారు.
ప్లస్ పాయింట్స్:
ఫస్టాఫ్
కమల్ హాసన్ యాక్టింగ్
క్లైమాక్స్
మైనస్ పాయింట్స్:
కథ
అనవసరపు సీన్స్
కొన్ని లాజిక్స్ మిస్సయ్యాయి
రేటింగ్ 2.75/5
-
చిరంజీవి - బాలకృష్ణ కలిసి నటించిన ఒకే ఒక్క సినిమా -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
తమిళనాట బిగ్ షాక్.. ఎన్నికల బరి నుంచి తప్పుకున్న స్టార్ హీరో.. ఆ పార్టీకి మద్దతు.. -
ధురంధర్2 సూపరంట..పవన్ కల్యాణ్ సినిమా గురించి నోరు తెరవని మన ‘భజన’ హీరోలు -
సవాల్ చేసి మరీ అవార్డు కొట్టాడయ్యా..! -
2007లో సినీ వజ్రోత్సవ వేడుకల్లో చిరంజీవి-మోహన్‌బాబు మాటల యుద్ధం -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !!












Click it and Unblock the Notifications