భారీ డిజాస్టర్... థియేటర్ కరెంటు ఖర్చులు కూడా రాలేదు!

విశ్వనాయకుడు కమల్ హాసన్ కథానాయకుడిగా నటించిన చిత్రం థగ్ లైఫ్. మణిరత్నం దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్ర రాజం అత్యంత ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. కనీసం మణిరత్నం సినిమాలు ఫ్లాపైనా కల్ట్ క్లాసికల్ సినిమాలుగా నిలిచేవి. థగ్ లైఫ్ దానికి కూడా నోచుకోలేదు. అంత దారుణంగా ఫ్లాపైన ఈ సినిమా కనీసం థియేటర్ కరెంటు ఖర్చులను కూడా రాబట్టుకోలేకపోయింది. అంతేకాదు.. సినిమాలేవీ లేకపోవడంతో ఖాళీగా ఉంచడం ఎందుకులే అన్న ఉద్దేశంతో థియేటర్ యాజమాన్యం ఈ సినిమాను ప్రదర్శిస్తోంది. చాలాచోట్ల దీన్ని తీసేశారు.

యువ దర్శకులతో తీయాలి
ఫైనల్ రన్ లో ఈ సినిమా రూ.100 కోట్ల గ్రాస్ కూడా రాబట్టలేకపోయింది. కన్నడంలో విడుదల కాకపోవడం కూడా ఒక మైనస్. ఇటీవలే అమరన్ సినిమాను అతి తక్కువ బడ్జెట్ తో నిర్మించి భారీ లాభాలను మూటకట్టుకున్న కమల్ హాసన్ ను ఈ సినిమా తీవ్రమైన నిరాశకు గురిచేసింది. ఈ తరానికి చెందిన యువ దర్శకులతో సినిమాలు చేస్తూ విజయాలను అందుకుంటున్న రజనీకాంత్ ను చూసైనా నేర్చుకోవాలని అభిమానులు అంటున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చేసి విక్రమ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అంటూ గుర్తుచేస్తున్నారు. మణిరత్నం గొప్ప దర్శకుడే అయినప్పటికీ గతంలో తీసిన స్థాయిలో సినిమాలు తీయలేకపోతున్నారంటున్నారు.

kamal haasan Thug Life was a huge disaster movie

తమిళనాడులోనే దారుణంగా..
సొంత తమిళనాడులోనే ఈ సినిమాకు కేవలం రూ.38 కోట్ల గ్రాస్ వచ్చింది. ఏపీ, తెలంగాణ నుంచి రూ.4 కోట్లు, కేరళ నుంచి రూ.3 కోట్లు, హిందీ నుంచి రూ.4 కోట్లు, విదేశాల నుంచి రూ.40 కోట్లు వచ్చాయి. అన్నీ కలిపితే రూ.90 కోట్ల గ్రాస్ అయింది. కన్నడంలో విడుదల చేసివుంటే కనీసం 100 కోట్ల రూపాయలైనా వచ్చేవి. థియేటర్ కరెంటు ఖర్చులే రాలేదంటే లాభాలు ఏం వస్తాయి.. దీంతో డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు భారీగా నష్టపోయారు. వీరిని ఆదుకోవడానికి కమల్ హాసన్ ఏం చేస్తాడో చూడాలి. రాజకీయాలతో సంబంధం లేకుండా కేవలం సినిమాపై దృష్టి నిలిపితే బాగుంటుందని నెటిజన్లు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+