థగ్ లైఫ్ సినిమా కోసం పాటరాసిన కమల్‌హాసన్...
నట విశ్వరూపం కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ పాత్రలోనైనా అవలీలగా ఒదిగిపోయి ఆ పాత్రకు ప్రాణం పోస్తాడు. ఆయన కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా పలు రంగాల్లో సత్తా చాటారు. తాజాగా ఓ చిత్రం కోసం లిరిసిస్ట్‌గా కూడా మారాడు. కమల్‌హాసన్ ప్రస్తుతం థగ్‌లైప్ సినిమా పనుల్లో బిజిగా ఉన్నారు. ఈ సినిమా కోసం ఆయన ఓ పాట కూడా రాసినట్లు సమాచారం. ఈ న్యూస్ కాస్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
చాలా ఏళ్ల తర్వాత దర్శకుడు మణిరత్నంతో కలిసి మళ్లీ పనిచేస్తున్నారు కమల్‌హాసన్. అదే థగ్ లైప్ సినిమా కోసం. ఈ సినిమాకు మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరూ కాంబీనేషన్‌లో వస్తున్న చిత్రం కాబట్టి ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో కమల్‌హాసన్‌కు జోడిగా త్రిష నటిస్తోంది. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్లపై కమల్ హాసన్, మణిరత్నం, ఆర్.మహేంద్రన్, శివ అనంతి థగ్ లైఫ్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష, శింబు కీలక పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఎన్నో సినిమాలకు పాటలు రాశారు..
కమల్‌హాసన్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో థగ్ లైఫ్ సినిమాలో ఓ సాంగ్‌కి లిరిక్స్ రాసినట్లు కమల్ హాసన్ చెప్పారు. అంతేకాదు, ఈ పాటను రాయడానికి, కంపోజ్ చేసి రికార్డ్ చేయడానికి కేవలం రెండే రెండు గంటలు పట్టిందని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు కమల్‌హాసన్ టాలెంట్‌కు ఫిదా అవుతూ తెగ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం కమల్‌హాసన్ ఈ సినిమా షూటింగ్ పనుల్లో బిజిగా ఉన్నారు. ఈ సినిమాతో పాటు ఆయన చేతిలో పలు ప్రాజెక్టులున్నాయి. ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడీ సినిమాలో కూడా కమల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన ఓ గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నారని టాక్.












Click it and Unblock the Notifications