కంగనా బోల్డ్ రివీల్: లైన్ వేసినా పట్టించుకోని ఏకైక హీరో అతనే!

సాధారణంగా సినిమా సెట్స్‌లో హీరో హీరోయిన్ల మధ్య చిన్నపాటి సరదా సంభాషణలు జరగడం సహజమే. షూటింగ్ సమయంలో నటీనటులు ఒకరితో ఒకరు జోకులు వేసుకోవడం లేదా సరదాగా ఫ్లర్టింగ్ చేయడం వంటివి జరుగుతుంటాయి. కానీ బాలీవుడ్ విలక్షణ నటుడు అక్షయ్ ఖన్నా విషయంలో మాత్రం ఇవి అస్సలు సాధ్యం కావని మరోసారి రుజువైది. అక్షయ్ ఖన్నా ఎంత రిజర్వ్‌డ్‌గా ఉంటారో చెప్పడానికి తాజాగా ఓ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ స్వయంగా అక్షయ్ ఖన్నా గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి.

అసలు ఏం జరిగిందంటే?
ప్రముఖ టాక్ షో 'కాఫీ విత్ కరణ్' (సీజన్ 3)లో కంగనా రనౌత్ పాల్గొన్నప్పుడు ఈ ఆసక్తికర విషయం బయటపడింది. ఆ షోలో అనిల్ కపూర్, సంజయ్ దత్‌లతో కలిసి పాల్గొన్న కంగనాను హోస్ట్ కరణ్ జోహార్ ఓ ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. "నువ్వు ఎవరికైనా లైన్ వేయడానికి లేదా ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేసినప్పుడు, నిన్ను ఎవరైనా పూర్తిగా ఇగ్నోర్ చేశారా?" అని అడగ్గా.. కంగనా ఏమాత్రం తడుముకోకుండా వెంటనే అక్షయ్ ఖన్నా పేరు చెప్పింది. అక్షయ్ తనను ఎంతలా పట్టించుకోలేదో చెబుతూ ఆమె ఆ షోలో ఆవేదన వ్యక్తం చేసింది.

Kangana Ranaut Bold Reveal When Akshaye Khanna Ignored Her Flirting on No Problem Sets

కంగనా ఆవేదన.. అనిల్ కపూర్ చమత్కారం
అక్షయ్ ఖన్నా గురించి కంగనా మాట్లాడుతూ.. "నేను అతనితో మాట్లాడటానికి చాలా ప్రయత్నించాను, కానీ అతను నాతో అస్సలు మాట్లాడలేదు. అసలు అతను ఎవరితోనూ మాట్లాడడు, తన పని తాను చేసుకుని వెళ్ళిపోతాడు" అని వాపోయింది. దీనికి మద్దతుగా నటుడు అనిల్ కపూర్ స్పందిస్తూ, ఆ సమయంలో జరిగిన ఒక ఫన్నీ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. "అవును, కంగనా నాతో కూడా చెప్పింది.. 'సార్, ఈయన నా వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు' అని బాధపడింది" అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు. అక్షయ్ ఖన్నా, కంగనా రనౌత్ కలిసి 2010లో 'నో ప్రాబ్లం' అనే సినిమాలో నటించిన సమయంలోనే ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది.

అక్షయ్ ఖన్నా శైలే వేరు!
బాలీవుడ్‌లో అక్షయ్ ఖన్నా చాలా సీరియస్ పర్సనాలిటీ అని.. అనవసరమైన ముచ్చట్లకు ఆయన దూరంగా ఉంటారని పేరుంది. షూటింగ్ సమయంలో ఆయన కేవలం తన పాత్ర మీద మాత్రమే శ్రద్ధ పెడతారని, మిగిలిన సమయమంతా తన లోకంలో తాను ఉంటారని ఆయన సహనటులు చాలాసార్లు చెబుతుంటారు. కంగనా వంటి స్టార్ హీరోయిన్ ఫ్లర్ట్ చేయడానికి ప్రయత్నించినా పట్టించుకోలేదంటే, అక్షయ్ వృత్తి పట్ల ఎంత నిబద్ధతతో ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అక్షయ్ ఖన్నా తన తాజా చిత్రం 'దురంధర్' విజయంతో మంచి జోష్‌లో ఉన్నారు.

అక్షయ్ ఖన్నా తదుపరి చిత్రాలు
ఇక అక్షయ్ ఖన్నా కెరీర్ విషయానికి వస్తే.. ఆయన త్వరలోనే టాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. 'మహాకాళి'అనే భారీ చిత్రంలో ఆయన 'శుక్రాచార్య' పాత్రలో కనిపించనున్నారు. దీనితో పాటు నెట్‌ఫ్లిక్స్‌లో రాబోతున్న 'ఇక్కా' అనే కోర్టు రూమ్ డ్రామాలో సన్నీ డియోల్‌తో కలిసి నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ మూవీ 'బోర్డర్' తర్వాత దాదాపు 29 ఏళ్లకు వీరిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+