గ్యాప్ లేకుండా 12 గంటలు అదే పని.. పీరియడ్స్ అప్పుడు కూడా !
ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది స్టార్ హీరోయిన్, ఎంపీ కంగనా రనౌత్. 2006లో గ్యాంగ్‌స్టర్ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాతోనే తన సహజ నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత ఫ్యాషన్ (2008)లో చేసిన పాత్రకు నేషనల్ అవార్డు అందుకున్నారు.
2014లో వచ్చిన క్వీన్ మూవీ ఆమె కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఆ తర్వాత తను వెడ్స్ మను సిరీస్, క్రిష్ 3,మణికర్ణిక (రాణి లక్ష్మీబాయి పాత్ర), థలైవీ (జయలలిత బయోపిక్) సినిమాలు ఆమెకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చాయి. ఇప్పటికే నాలుగు జాతీయ అవార్డులు గెలుచుకున్న కంగనా ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలను సమానంగా కొనసాగిస్తున్నారు.

రాజకీయాల్లోకి ఎంట్రీ..
2024లో కంగనా బీజేపీ తరఫున మండి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ప్రజా సమస్యలపై గళమెత్తుతూ, మహిళలకు సంబంధించిన అంశాలపై ధైర్యంగా మాట్లాడే స్వభావం వల్ల కంగనా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాకుండా ఏ విషయాన్ని అయినా ముక్కుసూటిగా మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తుంటారు.
పీరియడ్స్‌పై ఓపెన్..
ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పీరియడ్స్ సమస్యలు ఎలాంటి స్థాయి మహిళ అయినా తప్పవని కంగనా తెలిపారు. చాలామంది బహిరంగంగా ఈ విషయం గురించి మాట్లాడటానికి ఇష్టపడరు. కానీ ఇది మహిళల వాస్తవ సమస్య. నేను కూడా దీనికి మినహాయింపు కాదు అని ఆమె అన్నారు. అంతే కాకుండా గతంలో తనకు ఎదురైన ఓ చేదు ఘటనను గుర్తు చేసుకున్నారు. సినిమాల్లో హీరోయిన్స్‌కి ప్రత్యేక కారవాన్లు, వాష్‌రూమ్ సదుపాయాలు, అవసరమైతే విశ్రాంతి తీసుకునే వీలుంటుంది.
అలానే పీరియడ్స్ సమయంలో కూడా హాట్‌వాటర్, మెడికల్ సపోర్ట్ లాంటి సౌకర్యాలు లభిస్తాయి. అయితే రాజకీయ పర్యటనల్లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుందని.. రోజుకు 10-12 గంటల వరకు టూర్‌లో ఉండాల్సి వస్తుంది. చాలా సార్లు టాయిలెట్ సదుపాయం కూడా దొరకదు. ఇది నాకే కాదు ఇతర మహిళా ఎంపీలందరికీ పెద్ద సమస్యే. దీన్ని చిన్న ఇబ్బంది అని భావించొద్దని వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం కంగనా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. చాలామంది మహిళలు ఆమెకు మద్దతు తెలుపుతూ, మహిళా నాయకుల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది మాత్రం మహిళా ఎంపీలు ఎదుర్కొంటున్న ఈ సమస్యను ఇప్పటి వరకు ఎవరూ బహిరంగం చేయకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉందని మద్దతు తెలుపుతున్నారు.
-
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
ఐ లవ్డ్ ధురంధర్ 1.. బట్ - జక్కన్న సెన్సేషన్ రివ్యూ: అలాంటి హీరోలందరినీ చంపేసింది -
"ధురంధర్ 2 సినిమాను బ్యాన్ చేయాలి" -
హిందీ స్టార్ హీరోల వేధింపుల వల్లే డైరెక్టర్లకు కష్టాలు.. -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
నటి డ్రెస్ జిప్ తీసేసిన హీరో: డైరెక్టర్ కట్ చెప్పినా ఆగని రొమాన్స్! -
బన్నీ మూవీలో ఐదుగురు భామలా? అట్లీ స్కెచ్ మామూలుగా లేదుగా! -
సొంత భర్త సినిమాకు దీపిక ఆబ్సెంట్.. ఏం జరుగుతోంది..? -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్!












Click it and Unblock the Notifications