సినిమా హీరోయిన్ అవ్వకముందు షాకింగ్ జాబ్.. నటి బోల్డ్ లైఫ్ రివీల్!
బాలీవుడ్, వెబ్ సిరీస్‌లలో నటించి బోల్డ్ ఇమేజ్‌తో ఎంతో పాపులర్ అయిన కంగనా శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా కంగనా శర్మ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన చేసిన కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.
ప్రముఖ యాంకర్ సిద్ధార్థ్ కన్నన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను నటిగా మారకముందు ఎదుర్కొన్న కష్టాల గురించి కంగనా శర్మ పంచుకున్నారు. తాను సినిమాల్లోకి రాకముందు ఓ కాల్ సెంటర్లో పని చేసినట్లు ఆమె వెల్లడించారు. ఆ కాల్ సెంటర్లో ప్రధానంగా సె*క్స్ టాయ్స్, అడల్ట్ ఉత్పత్తులకు సంబంధించిన కస్టమర్ సర్వీస్ బాధ్యతలు చూసేదానినని ఆమె వెల్లడించారు.

అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ వంటి దేశాల్లో లేబర్ ఖర్చులు చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఆ కంపెనీలు తమ కాల్ సెంటర్లను ఇండియాలో తక్కువ ఖర్చుతో నిర్వహిస్తుంటాయని కంగనా శర్మ వివరించారు. ఆ సమయంలో తాను యూకే యాసలో మాట్లాడేదానినని పేర్కొన్నారు. తాను నేరుగా ఆ ఉత్పత్తులను విక్రయించలేదని.. కేవలం ఆన్‌లైన్‌లో సె*క్స్ టాయ్స్ ఆర్డర్ చేసిన విదేశీ కస్టమర్లకు వారి ప్రొడక్ట్స్ డెలివరీ అయ్యాయా లేదా అని ఫాలోఅప్ చేసేదానినని కంగనా శర్మ వెల్లడించారు.
అయితే ఈ విదేశీ కస్టమర్లతో మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు విచిత్రమైన అనుభవాలు ఎదురయ్యేవని కంగనా శర్మ పేర్కొన్నారు. కొందరు కస్టమర్లు తమ నిరాశను, కోపాన్ని తమపై ప్రదర్శిస్తూ అసభ్యంగా మాట్లాడేవారని.. 'నువ్వు వస్తున్నావా?' అంటూ అడ్డగోలుగా ప్రశ్నలు వేసేవారని ఆమె తెలిపారు. అయినప్పటికీ జాబ్ పోతుందనే భయంతో.. ఆ సమయంలో తనకు డబ్బులు చాలా ముఖ్యం కావడంతో వారి మాటలన్నింటినీ మౌనంగా భరించాల్సి వచ్చిందని కంగనా శర్మ భావోద్వేగంతో పంచుకున్నారు. కాగా కంగనా శర్మ గతంలో 'మోనా హోమ్ డెలివరీ', 'బ్లాక్‌మెయిల్', 'లెట్స్ ప్లే బ్లైండ్' వంటి పలు బోల్డ్ వెబ్ సిరీస్‌లలో నటించి ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే.













Click it and Unblock the Notifications