కంగువా రీలీజ్‌ వాయిదా... సూప‌ర్‌స్టార్‌ కోసం వెన‌క్కి త‌గ్గిన సూర్య‌...

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన 'కంగువ' మూవీ రీలీజ్‌ కోసం ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు. అయితే, వ‌చ్చే నెల ప‌దోతేదిన విడుద‌ల కావాల్సిన కంగువా చిత్రం వాయిదా ప‌డ‌నున్న‌ట్లు గ‌త కొన్నిరోజులుగా సోష‌ల్‌మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. అయితే, ఈ వార్త‌ల‌నే నిజం చేసేలా ఉన్నాయి... తాజాగా న‌టుడు సూర్య మాట్లాడిన మాటలు.. న‌టుడు కార్తీ హీరోగా న‌టించిన మెయ్యజగన్ ఆడియో లాంచ్ కార్య‌క్ర‌మంలో న‌టుడు సూర్య పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కంగువా చిత్రం విడుద‌ల‌పై కొన్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ కామెంట్స్ కాస్త సినిమా వాయిదా ప‌డే అవ‌కాశాలు క‌నిపిస్తున్న‌ట్లాయాని కోలివుడ్ వ‌ర్గాలు కోడై కూస్తున్నాయి.

శనివారం జరిగిన మెయ్యజగన్ ఆడియో లాంచ్ కార్య‌క్ర‌మంలో న‌టుడు సూర్య ఈ విధంగా మాట్లాడారు.. 'తమిళ చిత్ర పరిశ్రమ నుంచి ఒక డిఫ‌రెంట్ మూవీని ప్రేక్షకులకు అందించేందుకు సుమారు రెండున్నరేళ్ల పాటు వెయ్యికి మందికి పైగా శ్రమించాం. క‌ష్ట‌ప‌డ్డాం.. దర్శకుడు శివతో పాటు ప్రతి ఒక్కరూ ఈ చిత్ర నిర్మాణంలో ఎన్నో క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొని కంగువ కోసం పని చేశాం... కష్టపడి పనిచేస్తే.. ఏ ప‌నికైనా ఫలితం తప్పకుండా వస్తుందని నేను విశ్వ‌సిస్తాను.. కంగువ చిత్రం ఎప్పుడు రీలీజ్ అయినా మీరు తప్పకుండా అభిమానం, ప్రేమ చూపిస్తారనే నమ్మకం నాకుంది. అక్టోబర్‌ 10న కంగువా చిత్రంతో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్‌ వేట్టైయాన్ కూడా విడుదల‌కు సిద్ధంగా ఉంది. అయితే, ర‌జ‌నీ స‌ర్ సినిమానే ముందుగా విడుద‌ల్వాలి.. ఆయన నాకంటే సీనియర్. యాభైఏళ్లుగా ఆయ‌న‌ ఇండస్ట్రీలో ఉంటున్నారు. ముందుగా ర‌జ‌నీ స‌ర్‌ సినిమా వస్తేనే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఈ విషయంలో మీరు నాకు అండ‌గా ఉంటారని నమ్ముతున్నా.ఇక‌, కంగువా చిత్రం కొత్త విడుదల తేదీ త్వరలోనే ప్రకటిస్తాం. మా కష్టం వృధా కాదనే గ‌ట్టి న‌మ్మ‌కం మాకుంది. అంటూ చెప్పుకొచ్చారు సూర్య‌.

Kangua Release Postponed Surya Set Back For Superstar

నెటిజ‌న్ల ప్రశంస‌లు..

అయితే, ఈ మాట‌ల‌ను బ‌ట్టి కంగువా సినిమా వాయిదా ప‌డ‌నుంద‌ని అర్థ‌మ‌వుతుంది. కానీ, కంగువా వాయిదాపై అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది. కొత్త విడుదల తేదీ ప్రకటించకపోవడంతో సూర్య అభిమానులు కాస్త నిరాశకు గుర‌వుతున్నారు. సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ కోసం సూర్య వెనక్కి తగ్గడంతో ఆయ‌న అభిమానులు, నెటిజన్లు సూర్య‌పై ప్రశంసల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమాలో సూర్య మూడు భిన్నమైన లుక్స్‌లో కనిపించనున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో సూర్య‌కు జోడిగా దిశా పటానీ న‌టిస్తున్నారు. కంగువా చిత్రంలో బాబీ దేవోల్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా మొత్తం పది భాషల్లో రూపొందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+