హీరో ఫ్యాన్స్ దెబ్బకు షాక్, ఆ నలుగురు వేరే జైలుకు షిఫ్ట్, హీరో పేరు చెప్పేశారని భయం

చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో జైలుకు వెళ్లిన కన్నడ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ అండ్ గ్యాంగ్‌లోని 17 మంది నిందితుల్లో నలుగురిని కర్ణాటకలోని తుమకూరు జిల్లా సెంట్రల్ జైలుకు తరలించేందుకు కోర్టు అనుమతించింది.నటి పవిత్ర గౌడపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామిని నటుడు దర్శన్ మరియు అతని గ్యాంగ్ కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారని కేసు నమోదు అయ్యింది.

హత్య ఘటన తర్వాత నటుడు దర్శన్ నుండి రూ. 30 లక్షలు తీసుకున్న తర్వాతే రేణుకాస్వామిని హత్య చేశామని నలుగురు నిందితులు బెంగళూరు పోలీసుల ముందు లొంగిపోయారు. అయితే హత్య ఘటనపై పోలీసులు విచారించగా నటుడు దర్శన్ తో సహ హత్య కేసుతో సంబంధం ఉన్న అందరి పేర్లను బయటకు చెప్పేశారు.ఈ నేపథ్యంలో దర్శన్‌, నటి పవిత్ర గౌడతో పాటు మరికొందరి పేర్లను నిందితులు బయటకు చెప్పారు.

Kannada Hero Darshan s Name Revealed Accused In Murder Case Shifted To Another Jail

పోలీసుల ముందు దర్శన్, పవిత్ర గౌడ పేర్లతో సహ నిందితుల అందరి పేర్లు బయటకు చెప్పి నేరం ఒప్పుకున్న కార్తీక్, కేశవ్, నిఖిల్ సహా ఇతర నిందితులను పరప్ప అగ్రహార జైలు నుంచి వేరే జైలుకు తరలించాలని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రసన్నకుమార్ కోర్టును అభ్యర్థించారు. దీన్ని అంగీకరించిన కోర్టు నలుగురు నిందితులను తుమకూరు జిల్లా కోర్టుకు పంపించేందుకు అనుమతించింది.

రేణుకాస్వామి హత్యకేసులో నిందితులు ఒకే సెంట్రల్ జైలులో ఉండడం సురక్షితం కాదని, శాంతిభద్రతల దృష్ట్యా నిందితుల జైలును మార్చడమే సముచితమని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో దర్శన్ పరప్ప అగ్రహార జైలులో చేరిన రోజే స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రసన్న కుమార్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే దీనిపై దర్శన్, అతని గ్యాంగ్ తరఫు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో విచారణ వాయిదా పడింది.

Kannada Hero Darshan s Name Revealed Accused In Murder Case Shifted To Another Jail
సోమవారం మరోసారి విచారణ చేపట్టగా నిందితులను వేరే జైలుకు ఎందుకు తరలించాలి అని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రసన్నకుమార్ వివరించారు. అనంతరం నలుగురు నిందితులను తరలించేందుకు న్యాయమూర్తి అనుమతించారు.రేణుకాస్వామి హత్య కేసులో నిందితులైన ఏ8 రవి, ఏ15 కార్తీక్, ఏ16 కేశవమూర్తి, ఏ17 నిఖిల్ నాయక్‌లను తుమకూరు జిల్లా జైలుకు తరలిస్తున్నారు. హత్య కేసులో కార్తీక్, కేశవ్, నిఖిల్ తొలుత పోలీసుల ఎదుట లొంగిపోయారు.

ఈ హత్యను ఈ ముగ్గురు పోలీసుల ముందు పూర్తిగా అంగీకరించారు. పోలీసులు అరెస్ట్ చేయడంతో నటుడు దర్శన్, నటి పవిత్ర గౌడ, నటుడు ప్రదుష్‌లను అరెస్ట్ చేశారు. ఇప్పుడు శాంతిభద్రతల దృష్ట్యా పరప్ప అగ్రహారం సెంట్రల్ జైలు నుంచి మరో జైలుకు తరలిస్తున్నారు. బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో హీరో దర్శన్ అభిమానులు ఖైదీలుగా ఉన్నారని, హత్య కేసులో మా హీరో చెబుతారా అంటూ నలుగురిపై దాడి చేసే అవకాశం ఉందనే అనుమానంతో పొలీసులు కోర్టును ఆశ్రయించారు. హీరో దర్శన్ తో పాటు నటి పవిత్ర గౌడ తదితరులు ప్రస్తుతం పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులోనే ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+