యంగ్ హీరో రామ్ కోసం రంగంలోకి కన్నడ స్టార్ హీరో..!

టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఓ వైపు క్లాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటూనే.. మరోవైపు మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు ఈ యంగ్ హీరో. అయితే గత కొంతకాలంగా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోతున్నాడు. గతేడాది "డబుల్ ఇస్మార్ట్" తో ప్రేక్షకులను పలకరించిన ఈ హీరో భారీ డిజాస్టర్ ని మూటగట్టుకున్నాడు.

ఈసారి తనకు బాగా కలిసొచ్చిన లవ్ జోనర్ లోకి వచ్చేశారు. ప్రస్తుతం రామ్.. మహేష్ బాబు పి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. #RAPO 22 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీస్థాయిలో నిర్మిస్తోంది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా.. రామ్ 'సాగర్' అనే కాలేజ్ కుర్రాడి పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి ఓ న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో ఫుల్ గా చక్కర్లు కొడుతోంది.

kannada-star-upendra-going-to-act-in-ram-pothineni-new-movie

సినీ వర్గాల్లో నడుస్తున్న టాక్ ప్రకారం కన్నడ స్టార్ హీరో ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారని అంటున్నారు. మొదట ఈ పాత్ర కోసం మలయాళ స్టార్ మోహన్ లాల్ ను తీసుకోవాలని భావించినా.. చివరకు ఉపేంద్ర ఫైనల్ అయ్యారని ప్రచారం నడుస్తోంది. ఉపేంద్రకు సైతం ఈ స్టోరీ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెబుతున్నారు. ఇక ఉపేంద్రకు సైతం తెలుగులో కల్ట్ ఫాలోయింగ్ ఉందని అందరికీ తెలిసిందే. ఒక వైపు హీరోగానే చేస్తూనే సపోర్టింగ్ పాత్రల్లో కూడా అలరిస్తున్నారు ఈ స్టార్ హీరో. ఇప్పటికే తెలుగులో సన్నాఫ్ సత్యమూర్తి, గని సినిమాల్లో తన నటనతో మెప్పించాడు. దాంతో వరుస ఫ్లాప్ లలో ఉన్న రామ్ కి.. ఉపేంద్ర సపోర్ట్ కూడా తోడైతే ఈసారి బ్లాక్ బస్టర్ కొట్టడం గ్యారంటీ అంటూ ఆయన ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరోవైపు రామ్, ఈ మూవీలో నటిస్తున్న భాగ్యశ్రీతో రిలేషన్ లో ఉన్నారని సోషల్ మీడియా కోడై కూస్తుంది. రీసెంట్ గానే ఆమె ఇన్ స్టాలో ఒక ఫోటో షేర్ చేసింది. అందులో ఒక గదిలో సన్ కిస్ పోజులో పోస్ట్ చేసింది. అయితే అదే బ్యాక్ గ్రౌండ్ లో రామ్ ఫోటో కూడా ఒక ఫోటో పోస్ట్ చేశారు. దీంతో వీరిద్దరూ కలిసి ఉన్నారని.. డేటింగ్ చేస్తున్నారని అనుకుంటున్నారు. మరి ఈ మోస్ట్ బ్యాచిలర్ సినిమాతో పాటు రియల్ లైఫ్ లో కూడా ఆ బ్యూటీతో కనెక్ట్ అయ్యారో లేదో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+