శివరాజ్ కుమార్‌కు తృటిలో తప్పిన ప్రమాదం! (వీడియో)

కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్‌కు పెను ప్రమాదం తప్పింది. చిత్రదుర్గంలో తన తాజా సినిమా 'బెయిల్' ప్రమోషన్లలో పాల్గొంటున్న సమయంలో ఆయన తృటిలో ప్రమాదం తప్పించుకున్నారు. ఈ అకస్మాత్ ఘటనతో అక్కడ కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

అల్లు అర్జున్ కొత్త ప్రాజెక్టు ఆగిపోయిందా? అసలు నిజమేంటి?
అల్లు అర్జున్ కొత్త ప్రాజెక్టు ఆగిపోయిందా? అసలు నిజమేంటి?

అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతున్న 'బెయిల్' సినిమా ప్రమోషన్ల కోసం శివరాజ్ కుమార్ కర్ణాటకలోని చిత్రదుర్గం వెళ్లారు. ఈ ఈవెంట్‌కు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అభిమానులను కలుసుకుంటూ శివరాజ్ కుమార్ థియేటర్‌లోకి ప్రవేశిస్తున్న సమయంలో అభిమానులు కాల్చిన టపాకాయ ఒకటి ఆయనకు అత్యంత సమీపంలో పేలడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఊహించని పరిణామానికి భయపడిన శివరాజ్ కుమార్ వెంటనే తన ముఖాన్ని, తలను చేతులతో కవర్ చేసుకున్నారు. అప్రమత్తమైన శివరాజ్ కుమార్ వెంటనే అక్కడి నుంచి పక్కకు తప్పుకున్నారు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది, అక్కడున్న స్థానికులు ఆయనను చుట్టుముట్టి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ఘటనలో శివరాజ్ కుమార్ కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Kannada Superstar Shiva rajkumar Narrowly Escapes Firecracker Mishap During Bail Promotions Video Viral

ఈ ఊహించని పరిణామం జరిగినప్పటికీ శివరాజ్ కుమార్ తన ప్రమోషనల్ కార్యక్రమాలను ఆపలేదు. కొద్దిసేపు జరిగిన గందరగోళం సర్దుమణిగాక ఆయన యథావిధిగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా బెయిల్ సినిమా విశేషాలను పంచుకోవడంతో పాటు ఈ సినిమాకు సీక్వెల్ అయిన 'బెయిల్ 2' కూడా త్వరలోనే రానుందని వెల్లడించారు.

అన్ని చోట్లా హౌస్ ఫుల్స్.. చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది!
అన్ని చోట్లా హౌస్ ఫుల్స్.. చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది!

పవన్ వాడెయ్ దర్శకత్వం వహించిన 'బెయిల్' సినిమాలో శివరాజ్ కుమార్ పోలీస్ ఆఫీసర్ విజయ్ పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో జయరామ్, సాయికుమార్, దీక్షిత్ శెట్టి తదితరులు ప్రదాన పాత్రలు పోషించారు. ఇక శివరాజ్ కుమార్ త్వరలోనే రజినీకాంత్ హీరోగానెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న భారీ మల్టీస్టారర్ 'జైలర్ 2' సినిమాలోనూ కనిపించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+