అతన్ని పెళ్లి చేసుకోవద్దన్నారు..వినకుండా చేసుకున్నా- స్టార్ హీరోయిన్
హీరోయిన్ కరీనా కపూర్ క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన కరీనా కపూర్..ఆ తర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. సల్మాన్, షారుక్ వంటి స్టార్ హీరోలతో నటించి ఫుల్ క్రేజ్‌ను సంపాదించుకుంది.ఇక ఎఫైర్ల విషయంలో కూడా కరీనా కపూర్ ముందు వరుసలో ఉందనే చెప్పాలి. పలువురు హీరోలతో సాగించిన ఎఫైర్స్ కూడా ఆమెకు క్రేజ్‌ను తెచ్చిపెట్టింది.
బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్‌తో కరీనా కపూర్ ప్రేమయాణం సాగించింది. వీరిద్దరు కొన్నాళ్లు రిలేషన్‌లో ఉన్నారు.పెళ్లి చేసుకుంటానుకున్న వీరిద్దరు అభిప్రాయభేదాలు తలెత్తడంతో విడిపోయారు. షాహిద్‌తో బ్రేకప్ తర్వాత సైఫ్ అలీ ఖాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటికే పెళ్లై తన వయస్సు కూతురున్న వ్యక్తిని కరీనా ప్రేమించి పెళ్లి చేసుకోవడం అప్పట్లో సంచలనమే సృష్టించింది. ఇద్దరు పిల్లలకు తల్లైనా మంచి ఫిజిక్‌ను మెయింటైన్ చేయడంలో కరీనా కపూర్ తర్వాతే ఎవరైనా.

ఇక సోషల్ మీడియాలో అమ్మడు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది ఈ భామ. కరీనా కపూర్ తాజాగా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సైఫ్ అలీఖాన్‌ను పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినప్పుడు కొందరు నన్ను హెచ్చరించారు. వివాహం చేసుకుంటే కెరీర్ ముగిసిపోతుందన్నారు. కానీ ఎవరి మాటలు నేను పట్టించుకోలేదని కరీనా చెప్పుకొచ్చింది.
మన జాతకంలో ఎలా జరగాలని రాసిపెడితే అలా జరగుతుందని వారికి సమాధానమిచ్చానని కరీనా తెలిపింది. కానీ పెళ్లి తర్వాతే వర్క్ లైఫ్‌పై ఆసక్తి పెరిగిందని. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్నానని..నిన్ను నువ్వు నమ్ముకుని సవాళ్లకు స్వీకరించి ముందుకు సాగడంలోనే ఏదైనా ఉంటుందని కరీనా చెప్పుకొచ్చింది. పెళ్లై, తల్లిగా మారిన తర్వాత కూడా కరీనా క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. క్రూతో సూపర్ హిట్ అందుకున్న కరీనా'ది బకింగ్‌హామ్ మర్డర్స్' మూవీతో ప్రేక్షకులను మెప్పించింది.
-
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్












Click it and Unblock the Notifications