రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్
బాలీవుడ్ స్టార్ బ్యూటీ కరీనా కపూర్ క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఫిజిక్‌ను మెయింటైన్ చేయడంలో కరీనా తర్వాతే ఎవరైనా అనేలా క్రేజ్ తెచ్చుకుంది. సల్మాన్, షారుక్, అక్షయ్ కుమార్, అజయ్ దేవ్ గన్ సహా యంగ్ హీరో లతో కూడా నటించి ఫుల్ క్రేజ్‌ను సంపాదించుకుంది. కాగా స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్‌ను ఆమె 2012లో వివాహం చేసుకున్నారు.
కాగా పెళ్లి తర్వాత నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ జంటకు తైమూర్, జహంగీర్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరూ సంతోషంగా వైవాహిక జీవితం గడుపుతున్నారు. కరీనా కంటే ముందు సైఫ్ 1991లో నటి అమృతా సింగ్‌ను పెళ్లి చేసుకుని, 2004లో విడాకులు తీసుకున్నారు. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో 'మీరు ఎవరితో డేట్ చేయాలనుకుంటున్నారు? అని కరీనాను అడిగారు. దానికి ఆమె 'రాహుల్ గాంధీ' అని సమాధానమిచ్చారు.

అయితే ఎందుకు ఆయన్నే ఎంచుకున్నారని అడగ్గా.. నేను సినిమా కుటుంబం నుంచి వచ్చాను. మా నాన్న, తాతయ్య, ఇప్పుడు నా భర్త సైఫ్ అలీ ఖాన్ అందరూ సినీ రంగానికి చెందినవారే. నాకు రాజకీయాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంది' అని చెప్పారు. రాహుల్ గాంధీ రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి.. ఆయనతో డేటింగ్ చేస్తే రాజకీయాల గురించి అన్నీ తెలుసుకోవచ్చని అన్నారు. 'నేను రాహుల్ గాంధీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆయన ఫోటోలు చూస్తున్నాను. ఆయనతో మాట్లాడాలి, డేటింగ్ చేయాలి' అని తన మనసులోని మాట బయటపెట్టారు.
కోరిక తీరలేదు..
ఇదే ప్రశ్నను ఇటీవల 'క్యాచ్‌న్యూస్' ఇంటర్వ్యూలో కరీనాను మళ్లీ అడిగారు. దానికి ఆమె తన కోరిక ఇంకా తీరలేదని సూటిగా చెప్పారు. 'నాకు ఇప్పటికీ రాహుల్ గాంధీతో డేటింగ్ చేయాలనే ఉంది. మా ఇంటికి ఆయన్ను అతిథిగా పిలవాలనుకుంటున్నాను. ఆయన్ను దేశానికి ప్రధానమంత్రిగా చూడాలని కోరుకుంటున్నాను' అని కరీనా అన్నారు. దీంతో కరీనా చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

-
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ!












Click it and Unblock the Notifications