హీరో దర్శన్ మనిషా, రాక్షసుడా, సీఎం సంచలన వ్యాఖ్యలు ?, ఆ వీడియోలు చూసి షాక్?

కన్నడ నటుడు దర్శన్ తో పాటు అరెస్టు అయిన అతని గ్యాంగ్ రేణుకాస్వామిని ఎలా హత్య చేశారో అనే అసలు నిజం బయటకు తియ్యడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా హత్యకు గురైన రేణుకాస్వామిపై దర్శన్ దాడి చేస్తున్న సమయంలో తీసిన ఓ వీడియో పోలీసుల చేతిలో ఉందనే విషయం బయటకు రావడం కర్ణాటకలో కలకలం రేపుతోంది.

ఆ వీడియో చూసిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఏం చెప్పాడో అనే విషయం ఇప్పుడు కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది. స్టార్ హీరో దర్శన్ కన్నడ సినిమా ఇండస్ట్రీలో ఎవరినైనా ఢీకొట్టగలిగే హీరో అని కర్ణాటకలోని ఆయన అభిమానులు భావించిన్నారు. ఎందుకంటే దర్శన్ అభిమానులే అతడికి ఫిదా అయిపోయారు. చాలా మంది హీరోల సినిమాలతో ఢీకొట్టే దర్శన్ ఆయన అభిమానులకు ఢీబాస్ అయ్యాడు.

Karnataka CM Siddaramaiah make sensational comments about Kannada star hero Darshan

హీరో ద‌ర్శ‌న్ సినిమాలు విడుదలైన సమయంలో బ‌ల‌మైన హీరో ల సినిమాలు విడుదల అయినా ఆ సినిమాలు థియేటర్ల నుంచి పారిపోవ‌డం గ్యారెంటీ అని ఆయన అభిమానులు అంటున్నారు. అయితే ఇప్పుడు దర్శన్ హత్య కేసులో చిక్కుకున్న తరువాత ఆయన్ను వ్యతిరేకించే ఇతర హీరోల అబిమానుల మాటలు వదిలేయండి. స్వయంగా దర్శన్‌తో మంచి అనుబంధం ఉన్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, నటుడు దర్శన్ చర్యను చూసి కోపంగా ఉన్నట్లు అనిపిస్తుంది.

మీరో దర్శన్ మనిషి కాదు రాక్షసుడు అని సీఎం సిద్దరామయ్య అన్నారని కన్నడ మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. దర్శన్ కర్ణాటకలో పెద్ద పేరుగా పేరు తెచ్చుకున్నాడు. నటనతో కోట్లాది మంది అభిమానులను దర్శన్ సంపాదించుకున్నాడు. ఈ కారణంగా దర్శన్‌పై సమాజంలో పెద్ద బాధ్యత కూడా ఉంది. అయితే ఈ బాధ్యతాయుత పదవిలో సరిగ్గా ప్రవర్తించాల్సిన హీరో దర్శన్ దారుణంగా ప్రవర్తించి ఇప్పుడు కటకటాలు లెక్కిస్తున్నాడు.

ముఖ్యంగా నటుడు దర్శన్‌ను హత్యానేరంపై అరెస్టు చేయడానికి ముందు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్వయంగా ఆయన చర్యలకు సంబంధించిన వీడియోలను చూశారని తెలిసింది. బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ కొన్ని రోజుల క్రితం దర్శన్ అట్టహాసంగా రేణుకాస్వామిపై దాడి చేస్తున్న సమయంలో తీసిన ఓ వీడియోను స్వయంగా సిద్దరామయ్యకు చూపించి సీఎం నుంచి అనుమతి తీసుకుని హత్య నిందితుడు దర్శన్ ను మైసూరులో అరెస్ట్ చేశారని కన్నడ మీడియా తెలిపింది.

హీరో దర్శన్ దాడి చేస్తున్న సమయంలో తీసిన వీడియో చూసి ఒక్క క్షణం షాక్ తిన్న సీఎం సిద్ధరామయ్య ఈ దర్శన్ మనిషా, లేక రాక్షసుడా అని పోలీసు అధికారులను ప్రశ్నించారని తెలిసింది. సీఎం సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యల తరవాత పోలీసులు నేరుగా మైసూరు వెళ్లి జిమ్ చేస్తున్న హీరో దర్శన్ ను అదుపులోకి తీసుకున్నారని తెలిసింది.

పోలీసుల విచారణలో చాలా డ్రామాలు చేస్తున్న దర్శన్ నిన్న నిజం చెప్పాడని ఓ పోలీసు అధికారి అంటున్నారని కన్నడ మీడియా తెలిపింది. అలాగే హత్యకు పాల్పడిన నిందితుడు దర్శన్ పోలీసుల కాళ్లు పట్టుకుని నన్ను వదిలేయండి అని చెప్పాడని కన్నడ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు పోలీసు కస్టడీలోనే ఉన్న హీరో దర్శన్ బెయిల్ తీసుకోవడానికి ఆయన న్యాయవాదుల తరపున కోర్టును ఆశ్రయిస్తున్నాడని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+