వివాదంలో స్టార్ హీరో, విజయోత్సవ సభలో ఇలా మాట్లాడుతాడా ?, ఫిల్మ్ చాంబర్ !
అసభ్య పదజాలంతో ప్రముఖ నిర్మాతను బెదిరించాడని ఆరోపిస్తూ శ్యాండిల్ వుడ్ హీరో, డీ బాస్, చాలెంజింగ్ స్టార్ దర్శన్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కర్ణాటక ప్రజాపర వేదిక బుధవారం కన్నడ ఫిల్మ్ చాంబర్ లో ఫిర్యాదు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. కాటేరా సినిమా 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన విజయోత్సవ వేడుల వేదికపై హీరో దర్శన్ ప్రముఖ నిర్మాత ఓ అబద్ధాల కోరు అంటూ ఆయన్ను అసభ్య పదజాలంతో దూషించారని కర్ణాటక ప్రజాపర వేదిక ఆరోపించింది.
ఓ నిర్యాతను బెదిరించిన హీరో దర్శన్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కర్ణాటక ప్రజాపర వేదిక డిమాండ్ చేసింది. బుధవారం కర్ణాటక ఫిల్మ్ చాంబర్ లో హీరో దర్శన్ మీద ఆ సంస్థ పదాదికారులు ఫిర్యాదు చేశారు. నిర్మాత ఉమాపతి శ్రీనివాస్ ను అసభ్య పదజాలంతో దూషించి ఆయన్ను చంపేస్తానని బెదిరించిన నటుడు దర్శన్‌పై ఫిల్మ్ చాంబర్ నియమాల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆ సంస్థ ప్రతినిధులు మనవి చేశారు.

హీరో దర్శన్ స్టేజ్ మీద నిర్మాత ఉమాపతి శ్రీనివాస్ ను బెదిరించాడని, ఇది చట్టవిరుద్ధం అని, హీరో దర్శన్ వెంటనే నిర్మాతకు క్షమాపణ చెప్పాలని, లేకుంటే వందలాది మంది మా సంస్థ ప్రతినిధులు, కన్నడిగులు కలిసి హీరో దర్శన్ ఇంటి ముందు నిరవదికంగా ధర్పాలు చేస్తామని కర్ణాటక ప్రజాపర వేదిక సంస్థ నాయకులు హెచ్చరించారు. ఇదే సమయంలో హీరో దర్శన్ మీద కర్ణాటక ప్రజాపర వేదిక నాయకులు కన్నడ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఫిర్యాదు చెయ్యడం శ్యాండిల్ వుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది.
కాటేరా సినిమా 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్బంగా మంగళవారం విజయోత్సవ వేడుకల కార్యక్రమం నిర్వహించారు. కాటేరా సినిమా హీరో చాలెంజింగ్ స్టార్ దర్శన్ తో పాటు ఆ సినిమా యూనిట్ సభ్యులు, శ్యాండిల్ వుడ్ కు చెందిన ప్రముఖులు చాలా మంది కాటేరా విజయోత్సవ వేడుకల కార్యక్రమంలో పాల్గోన్నారు. ఈ సందర్బంగా హీరో దర్శన్ ఆవేశంగా మాట్లాడారని ఆరోపణలు ఉన్నాయి.

కాటేర సినిమా వేడుక వేదికపైన హీరో దర్శన్ శ్యాండిల్ వుడ్ నిర్మాత ఉమాపతి శ్రీనివాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేవారు. ఓహ్, రాబర్ట్ కథను మేమే మీకు అందించామని, మరి ఇంత మంచి కథను ఎందుకు వదిలేశావు?' కటేరా కథను ఎందుకు విడిచిపెట్టావు? అని నిర్మాత ఉమాపతిని నటుడు దర్శన్ ప్రశ్నించారు. దర్శన్ తన ప్రసంగాన్ని మళ్లీ కొనసాగించాడు, ఇదే సమయంలో నిర్మాత ఉమాపతి శ్రీనివాస్ మీద హీరో దర్శనం విరుచుకుపడటంతో అక్కడ ఉన్న వాళ్లు అందరూ షాక్ అయ్యారని కన్నడ మీడియా అంటోంది. శ్యాండిల్ వుడ్ నిర్మాత ఉమాపతి శ్రీనివాస్ మీద అనుచుతి వ్యాఖ్యలు చేసిన చాలెంజింగ్ స్టార్ దర్శన్ మీద ఇప్పుడు కర్ణాటక ప్రజాపర వేదిక సంస్థ మండిపడుతోంది.












Click it and Unblock the Notifications