Karthika deepam 2 November 10th:మెగా ట్విస్ట్ - సీఈవో రేసులోకి దీప ఎంట్రీ..!!
కార్తీక్‌ను బోర్డు మీటింగ్‌లోకి పిలిపించడంతో జ్యోత్స్న రగిలిపోయింది. కార్తీక్ సీఈవో కావాలంటే తన అగ్రిమెంట్ అడ్డుపడుతుందని చెప్పడంతో, ఆ ఒప్పందానికి కట్టుబడి ఉంటానని కార్తీక్ మాటిచ్చాడు. దీనితో కొత్త సీఈవోను ప్రకటిస్తామని శివన్నారాయణ చెప్పగా, అదే సమయంలో దీప ఎంట్రీ ఇచ్చి జ్యోత్స్నను, దశరథ్‌ను షాక్‌కు గురి చేసింది. దీపను సీఈవో కాకుండా ఆపమని జ్యోత్స్న, పారిజాతానికి పురమాయించడంతో, సుమిత్రను రెచ్చగొట్టి ఆఫీస్‌కు బయలుదేరింది పారిజాతం.
నేటి 511వ ఎపిసోడ్ హైలైట్స్ (నవంబర్ 10)
పారిజాతంపైనే పారు ప్లాన్ రివర్స్:
కార్తీక్, దీప ఆఫీస్‌లో భోజనం ఏర్పాట్లు చేస్తుండగా, పారిజాతం సుమిత్రను తీసుకుని ఎంట్రీ ఇచ్చింది. జ్యోత్స్న ప్రశ్నించగా, దీప వచ్చినప్పుడు తాము వస్తే తప్పేంటి అని పారు కౌంటర్ ఇచ్చింది. అనంతరం శివన్నారాయణను విడిగా కలిసిన పారిజాతం, 'పనిమనిషి దీపను సీఈవో చేస్తారా?' అంటూ ఆయన పెద్దరికాన్ని ప్రశ్నించింది.

శివన్నారాయణ షాక్:ఆ మాటలకు శివన్నారాయణ కూల్‌గా స్పందిస్తూ..."ఇప్పటి వరకు నేను అనుకున్న మనిషి వేరు. కానీ నువ్వు ఈ లోపు ఇచ్చిన సలహా నాకు బాగా నచ్చింది" అని థ్యాంక్స్ చెప్పాడు. "నీ వల్లే దీపను సీఈవోని చేయాలన్న ఆలోచన వచ్చిందని" శివన్నారాయణ చెప్పడంతో పారిజాతం షాక్ అయ్యింది. వంటగదిని నడిపింది... ఇకపై రెస్టారెంట్‌ని నడుపుతుందని శివన్నారాయణ తేల్చిచెప్పారు.
జ్యోత్స్నపై పారు ఆగ్రహం
పారిజాతం వేసిన ప్లాన్ రివర్స్ అవడంతో జ్యోత్స్న ఆమెపై మండిపడింది. "దీపను సీఈవో కాకుండా ఎలా ఆపుతావు?" అని జ్యోత్స్న అడగ్గా, పారిజాతం సీరియస్ అయ్యింది. "ఆపడాలు లేవు, పైకి పంపడాలే. ఒక్కటే పోటు దెబ్బకు చచ్చి ఊరుకుంటుంది" అంటూ కత్తిని చూపించింది. తన మనవరాలు పనిమనిషి ముందు ఓడిపోవడం ఇష్టం లేదని ఆమె కఠినంగా చెప్పింది.
కాంచన వైరాగ్యం: 'గతాన్ని మరిచి బతుకుతున్నా!'
కాంచన ఒంటరిగా భోజనం చేస్తుండగా వచ్చిన శ్రీధర్, పాత జ్ఞాపకాలు గుర్తు చేయడం ప్రారంభించాడు. "అవన్నీ ఒక అబద్ధాన్ని నిజం అనుకుని నేను మోసపోయిన రోజులు" అని కాంచన వైరాగ్యంతో చెప్పింది. మెడలో మంగళసూత్రాన్ని సరిచేసుకునేటప్పుడైనా కట్టినవాడు గుర్తురాడా అని శ్రీధర్ ప్రశ్నించగా, "దానిని కట్టినవాడి చేయి మూడు ముళ్లు కాదు, ఆరు ముడులు వేసింది" అని కాంచన కన్నీటి పర్యంతమైంది.
బోర్డు మీటింగ్‌లో సుమిత్ర కీలక మాట
భోజనం తర్వాత అందరూ బోర్డు మీటింగ్‌లో కూర్చున్నారు. దీప వంటకాలను మెచ్చుకున్న దశరథ్‌ను చూసి రగిలిపోయిన జ్యోత్స్నను చూసి సుమిత్ర, "నీ గురించి ఆలోచించడానికి ఎవరున్నారు? నిన్ను నేను జంటగా చూడాలని అనుకుంటున్నాను" అని చెప్పింది.కొత్త సీఈవో గురించి అడగ్గా, శివన్నారాయణ కోడలి వైపు చూశారు. అప్పుడు సుమిత్ర, "సీఈవో పదవిని అందుకోవడానికి రక్తంలో వారసత్వం ఉండటం కాదు.. సమర్థత కావాలి" అని చెప్పింది. ఈ సంస్థను సమర్థత ఉన్న వ్యక్తి నడిపించాలని చెప్పి, శివన్నారాయణ ప్రశంసలు అందుకుంది.
కార్తీక్ సంచలన ప్రకటన:సీఈవోగా దీప పేరు ప్రతిపాదన!
తాడోపేడో తేల్చుకునే క్షణం రానే వచ్చింది. బోర్డు మెంబర్స్ కొత్త సీఈవో ఎవరని అడగ్గా, కార్తీక్ జ్యోత్స్నకు ఇచ్చిన అగ్రిమెంట్ గురించి చెప్పి, తాను సీఈవోగా ఉండే అవకాశం లేదని స్పష్టం చేశాడు.ఆ తర్వాత కార్తీక్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు."అందుకే ఈ సంస్థ కొత్త సీఈవోగా నా భార్య దీపను ప్రపోజ్ చేస్తున్నాను" అని కార్తీక్ ప్రకటించడంతో బోర్డు మెంబర్స్, దశరథ్ షాక్ అయ్యారు. జ్యోత్స్న, పారిజాతాల నోట మాట రాలేదు.
తరువాత ఏం జరుగుతుంది? ఒక పనిమనిషి సీఈవోగా ఎలా ఉంటుందని జ్యోత్స్న తిరుగుబాటు చేస్తుందా? దీప సీఈవోగా అంగీకరిస్తుందా? పారిజాతం దీపపై కత్తి ఎత్తుతుందా? తర్వాతి ఎపిసోడ్‌లో తెలుస్తుంది.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications