Karthika deepam 2 November 12th:మెగా ట్విస్ట్-కొత్త సీఈఓగా ఎవరంటే..?

బుల్లితెర ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తున్న 'కార్తీకదీపం 2' సీరియల్‌లో మరో సంచలన ఘట్టం ఆవిష్కృతమైంది. దీపను సీఈవోగా ప్రకటించినప్పటికీ, బావ కార్తీక్ డ్రైవర్‌గా ఉంటే తాను సీఈవోగా ఉండబోనని ఆమె ఆ బాధ్యతలను తిరస్కరించడం... ఎపిసోడ్‌కు హైలైట్‌గా నిలిచింది. దీంతో కంపెనీకి కొత్త సీఈవో ఎవరనే ప్రశ్న బోర్డు మీటింగ్‌లో మళ్లీ తలెత్తింది. అయితే, దీప తిరస్కరణకు గురైన ఆ క్షణమే తమ తదుపరి వ్యక్తికి సందేశం వెళ్లిపోయిందని శివన్నారాయణ ప్రకటించడంతో ఉత్కంఠ పతాక స్థాయికి చేరింది.

నేటి 513వ ఎపిసోడ్ హైలైట్స్ (నవంబర్ 12)
'సూటు-బూటు'లో శ్రీధర్ ఎంట్రీ:మాజీ సీఈవో జ్యోత్స్నకు షాక్!

కొత్త సీఈవో ఎవరా అని అందరూ ఎదురు చూస్తుండగా, ఎప్పుడూ పంచెలో కనిపించే శ్రీధర్ ఈసారి సరికొత్తగా సూటు, బూటు ధరించి ఆఫీస్‌లోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ షాక్‌కు గురి చేశాడు. ఎదురుగా మనిషిని పెట్టుకుని కూడా సీఈవో ఎవరు? అని అడిగిన జ్యోత్స్నపై శివన్నారాయణ మండిపడ్డాడు.

Karthika deepam 2 Serial November 12th Episode 513 Here is todays full story

శ్రీధర్ పర్సనల్ లైఫ్ గురించి ప్రస్తావించి, ఆయన సీఈవోగా అర్హుడా అని నిలదీసిన జ్యోత్స్నను శివన్నారాయణ సీరియస్‌గా వారించారు. బిజినెస్‌మెన్‌గా శ్రీధర్ సక్సెస్‌ఫుల్ పర్సన్ అని ప్రకటించిన శివన్నారాయణ, జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్‌కి కొత్త సీఈవోగా శ్రీధర్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాక, కార్తీక్‌ను బోర్డుకు ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా నియమిస్తున్నట్లు చెప్పి జ్యోత్స్న మాజీ సీఈవోగా తక్షణమే రాజీనామా చేయాలని ఆదేశించారు. దీంతో షాక్‌లో ఉన్న జ్యోత్స్న రాజీనామా చేయాల్సి వచ్చింది.

తండ్రి రుణం తీర్చిన కొడుకు: కార్తీక్-శ్రీధర్ భావోద్వేగం

అందరూ వెళ్లిపోయిన తర్వాత, శివన్నారాయణ శ్రీధర్‌ను సీఈవో కుర్చీలో కూర్చోబెట్టారు. తాను ఈ గౌరవప్రదమైన స్థానంలో కూర్చోవడానికి కారణం తన కొడుకు కార్తీక్ మాత్రమేనని శ్రీధర్ భావోద్వేగానికి లోనయ్యారు. "నా కొడుకు నన్ను గెలిపించాడు. నాలో మార్పుకు కారణం నువ్వే. ఇది తండ్రిని గెలిపించిన కొడుకు కథ" అని అన్నారు. తల్లికి అన్యాయం చేసినందుకు తనపై పగ పెంచుకోకుండా, ప్రేమ చూపించిన కార్తీక్‌ను చూసి గర్వపడ్డారు. "తలకొరివి పెడితేనే తండ్రి రుణం తీరుతుందని అంటారు, కానీ నా రుణం ముందే తీరిపోయింది" అంటూ శ్రీధర్ కన్నీటిపర్యంతమయ్యారు.

అలాగే, ఈ రోజు కాంచనతో కలిసి భోజనం చేసిన విషయాన్ని శ్రీధర్ గుర్తు చేయగా, "నువ్వు నా తండ్రివి కాబట్టి" అని కార్తీక్ బదులిచ్చాడు. భార్య కాంచన క్షమిస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్నానని శ్రీధర్ మనసులో అనుకున్నారు.

Karthika deepam 2 Serial November 12th Episode 513 Here is todays full story

ఇంట్లో పంచాయతీ.. దేశం వదిలి వెళ్తున్న జ్యోత్స్న!

అంతా హ్యాపీగా ఉందనుకునే లోపే, శివన్నారాయణ ఇంట్లో పారిజాతం తీసుకొచ్చిన కత్తి గురించి పంచాయతీ పెట్టగా, అక్కడకు సూట్‌కేస్‌తో వచ్చిన జ్యోత్స్న అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. తాను కెనడా వెళ్లిపోతున్నట్లు ప్రకటించింది.

"నాకు ఇక్కడ ఎవరూ లేరు. నా జీవితాలు తలకిందులు అవుతుంటే మీరు కత్తి, సుత్తి అని పంచాయతీలు పెట్టుకుంటారు" అంటూ జ్యోత్స్న ఆగ్రహం వ్యక్తం చేసింది. తనను కాదని అల్లుడిని సీఈవో చేసిన పెద్దవాళ్ల నిర్ణయాన్ని గౌరవించాలని సుమిత్ర చెప్పగా, పిల్లల మనసుల్ని కూడా పెద్దవాళ్లు అర్థం చేసుకోవాలని జ్యోత్స్న కౌంటర్ ఇచ్చింది. నచ్చిన మనుషులకు ఎన్ని తప్పులు చేసినా క్షమించి, నచ్చని మనిషి ఎప్పుడు తప్పుకుంటాడా అని ఎదురుచూస్తారని ఆవేదన వ్యక్తం చేసింది.

దశరథ్ ఓటు కూడా దీపకే పడటాన్ని నిలదీసిన జ్యోత్స్న, తన భర్తను అవమానించిన ఆ స్థానం తనకు వద్దని దీప వదిలేసిన పోస్ట్‌లో.. ఇంటి అల్లుడిని కూర్చోబెట్టిన ఈ ఘోరాల్ని చూస్తూ ఉండలేనని కన్నీరు పెట్టుకుంది. మేమంతా నీకు ఉన్నాము అని దశరథ్ చెప్పినా వినకుండా, "నేను దేశాన్ని వదిలి వెళ్లిపోతాను" అంటూ జ్యోత్స్న ఇంట్లో నుంచి బయలుదేరింది. ఆ సమయంలో శ్రీధర్ వచ్చి, తాను గుర్తింపు, గౌరవాన్ని కోరుకోవడం లేదని, తమ ప్రేమ మాత్రమే కావాలని చెప్పడంతో ఎపిసోడ్ ముగుస్తుంది.

తరువాత ఏం జరగనుంది? జ్యోత్స్న నిజంగానే దేశం విడిచి వెళ్లిపోతుందా? శ్రీధర్‌ను సీఈవోగా నియమించడాన్ని ఆమె అంగీకరిస్తుందా? తెలియాలంటే తదుపరి ఎపిసోడ్ చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+