Karthika deepam 2 October 11th Episode:కార్తీక్ అల్టిమేటం!తాత చేతిలో జ్యోత్స్న పదవికి ఎసరు!
కంపెనీ నష్టాల్లో ఉండటం, 50 శాతం వాటాను వైరాకు అమ్మేయడానికి బోర్డు మెంబర్స్ సిద్ధపడటంతో శివన్నారాయణ కుటుంబం షాక్ అయ్యింది. అయితే, మాజీ సీఈఓగా కార్తీక్ బోర్డు మీటింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చి, కంపెనీ రూల్స్ గురించి చెప్పి వైరా ప్లాన్‌ను చెడగొట్టాడు. తనను ఫూల్‌ని చేశారని జ్యోత్స్న కోపంతో రగిలిపోగా... ఆఫీస్ బయట వైరా, కార్తీక్‌లు ఒకరికొకరు వార్నింగ్ ఇచ్చుకున్నారు.
నేటి ఎపిసోడ్ (అక్టోబర్ 11)లో ఫ్యామిలీ వర్సెస్ కంపెనీ!
వైరా: "దశరథతో తేల్చుకోవాల్సిన లెక్కలు నాకు చాలా ఉన్నాయి. నువ్వు అడ్డు పడొద్దు. అడ్డుపడితే... నీ కారుకి లారీ గుద్దొచ్చు, నీ చిన్న కూతురిపై అటాక్ జరగవచ్చు" అని బెదిరించాడు.

కార్తీక్: "నువ్వు నా కూతురు గురించి మాట్లాడావు కదా? ఊరికి పోతురాజు ఎలాగో, నా ఫ్యామిలీకి నేను అలాగే! ఫ్యామిలీ జోలికి వస్తే ఈ పోతురాజు కత్తి వాడతాడు! నా ఫ్యామిలీ అంటే కంపెనీ ఉద్యోగులతో సహా అంతా ఉంటారు" అని పోతురాజు స్టైల్‌లో వైరాకు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. "ఇప్పుడు తెలిసి నేను గేమ్ ఆడితే ఈసారి నీ నష్టం డబ్బు రూపంలో ఉండదు" అని వైరాను ట్రాన్స్‌ఫార్మర్‌తో పోల్చి కార్తీక్ భయపెట్టాడు.
కాశీ, దాస్‌ల మధ్య ఎమోషనల్ ఫైట్!
దాస్‌తో జ్యోత్స్న రహస్యంగా ఎందుకు మాట్లాడిందని కాశీ నిలదీశాడు. ఉద్యోగం లేకపోయినా తనపై నమ్మకం ఉంచింది తండ్రి ఒక్కడే అనుకున్నానని, కానీ ఇప్పుడు తండ్రి కూడా నమ్మట్లేదని బాధపడ్డాడు. "నాకు ఉద్యోగం లేదు, ఇంట్లో విలువ లేదు... మా మామగారు తన కొడుకుని వదిలేశారు, నువ్వు నీ కొడుకుని వదిలేశావ్. నువ్వు కూడా చేతకాని తండ్రివే!" అని కాశీ అనడంతో దాస్‌కు కోపం వచ్చి కొట్టబోయాడు. శ్రీధర్ వచ్చి ఆపి, దాస్‌కు క్లాస్ పీకాడు.
జ్యోత్స్న సీఈఓ పదవికి ఎసరు!
మరోవైపు, కంపెనీని లాభాల్లోకి తీసుకురావాలంటే గట్టి నిర్ణయం తీసుకోవాలని శివన్నారాయణ అనుకున్నాడు. "సీఈవోగా నువ్వు కంపెనీని నడిపించలేవని అందరికీ అర్థమైపోయింది!" అని జ్యోత్స్నతో చెప్పి శివన్నారాయణ షాక్ ఇచ్చాడు. "బోర్డు మెంబర్స్ వద్దు అని చెప్పేలోగా నువ్వే రాజీనామా చేయి" అని అనడంతో పారు, జ్యోత్స్న, సుమిత్రలు షాక్ అయ్యారు.
"నువ్వే సీఈఓగా రాజీనామా చేస్తే మంచిది. పరువు పోగొట్టుకోవడం కంటే పదవి పోగొట్టుకోవడమే బెటర్" అని దశరథ, సుమిత్ర హితవు పలికారు. వచ్చే బోర్డు మీటింగ్‌లో కొత్త సీఈఓని అనౌన్స్ చేస్తానని శివన్నారాయణ చెప్పడంతో జ్యోత్స్న నిస్సహాయంగా ఉండిపోయింది.
కార్తీక్‌కు శివన్నారాయణ అపూర్వ విజ్ఞప్తి!
దాస్-శ్రీధర్‌ల సంభాషణలో.. దీప, కార్తీక్-సుమిత్రల కూతురు అనే నిజం దాస్‌కి తెలుసని, అందుకే కార్తీక్ దీప కోసం పోరాటం చేస్తున్నాడని మరోసారి రుజువైంది. ఎపిసోడ్ చివర్లో.. కార్తీక్‌ని పిలిచిన శివన్నారాయణ, "ఈరోజు నాలో భయాన్ని మొదటిసారి చూశాను. యుద్ధాన్ని గెలిపించడానికి నువ్వు నా పక్కన నిలబడతావా? నాకు ఓ ప్లేయర్ కావాలి" అని అడగడంతో ఎపిసోడ్ ముగుస్తుంది.
శివన్నారాయణ కోరికకు కార్తీక్ అంగీకరిస్తాడా? జ్యోత్స్న పరువు నిలబడుతుందా? తెలియాలంటే తరువాయి ఎపిసోడ్ చూడాల్సిందే!












Click it and Unblock the Notifications