Karthika deepam 2 October 27th Episode:శివన్నారాయణ నాటకం షురూ - సుమిత్ర జాడ తెలిసినా..

కార్తీక్ ఇంట్లో సుమిత్ర దాక్కున్న విషయం శివన్నారాయణకు తెలిసిపోవడంతో, కోపం పట్టలేక కాంచన కుటుంబాన్ని నిలదీశారు. "మీరు చేసిన తప్పుకు ఈ జన్మలో క్షమించను, నా కోడల్ని తీసుకెళ్తాను" అని శపథం చేస్తారు. అయితే, సుమిత్ర ఇంటికి వస్తే ఆమెను చూడటం అదే చివరిసారి అవుతుందని కార్తీక్ హెచ్చరించడంతో పెద్దాయన షాక్ అవుతారు.

దాంతో, దశరథ్ కుటుంబం బాగుండాలనే త్యాగమే సుమిత్ర దాక్కున్న అసలు కారణమని తెలుసుకుని శివన్నారాయణ పశ్చాత్తాపపడి, అందరినీ క్షమించమని వేడుకుంటారు. అటు, ఆఫీస్‌కు వెళ్తున్నానని హడావిడి చేసిన కాశీ, రోడ్డుపై ఫ్రెండ్‌తో కబుర్లు చెబుతూ శ్రీధర్‌కు దొరికిపోవడం ఉత్కంఠను పెంచింది.

Karthika deepam 2 Serial October 27th Episode 499 Here is the Today s full story

తాత ప్లాన్‌తో దశరథ్‌కు షాక్!
సుమిత్ర తమ ఇంట్లో ఉన్న విషయం ఎవరికీ చెప్పొద్దని కార్తీక్ తాతకు మాట తీసుకుని ఇంటికి వస్తాడు. ఇంట్లో సుమిత్ర ఫొటో చూస్తూ కుమిలిపోతున్న దశరథ్‌ను చూసి, శివన్నారాయణ అనూహ్యంగా మాట మార్చారు. సుమిత్రను వెతకాల్సిన అవసరం లేదని, "పోతే పోనీ.. మనకెందుకు బాధ?" అని అంటాడు.

సుమిత్రపై గౌరవం లేని భార్య గురించి ఎందుకు ఆలోచిస్తావని దశరథ్‌ను నిలదీయడం, డ్రైవర్ కార్తీక్‌ను "నువ్వు డ్రైవర్‌లా ఉండు" అని అవమానించడంతో పారిజాతం, జ్యోత్స్నలు షాకవుతారు. "మాట, వస్తువు వదిలేముందు ఆలోచించాలి. నువ్వు పొమ్మన్నావు.. అందుకే తను వెళ్లిపోయింది" అంటూ తప్పు దశరథ్‌దే అని శివన్నారాయణ వేలెత్తి చూపారు.

పెళ్లి రోజు అస్త్రం
"రేపు మీ పెళ్లిరోజు కదా? సుమిత్ర లేదు కాబట్టి సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు" అంటూ దశరథ్‌కు మరింత షాక్ ఇచ్చాడు. ఏదైనా దూరమైతేనే విలువ తెలుస్తుందని, ఈసారి సుమిత్రకు నీ విలువ తెలుస్తుందని ఎత్తిపొడుస్తాడు. ఈ మాటలు కేవలం దశరథ్‌ను బాధ పెట్టడానికి కాదు, అతనిలోని ప్రేమను బయటకు తీసుకురావడానికి శివన్నారాయణ వేసిన ప్లాన్ అని కార్తీక్‌కు అర్థమవుతుంది.

కాశీ నిజం బయట పడుతుందా?
ఆఫీస్ నుంచి వచ్చిన కాశీకి బత్తాయి జ్యూస్ ఇచ్చి, "నువ్వు జాబ్ చేస్తుంటే నేను స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను" అని శ్రీధర్ అంటాడు. ఆ తర్వాత, కాశీ ఉదయం ఫ్రెండ్‌తో మాట్లాడిన ఫోటో చూపించడంతో కాశీ షాక్ అవుతాడు. "నువ్వు పని చేస్తున్న కంపెనీకి వెళ్తే అక్కడ ఎవరూ లేరన్నారు, ఏంట్రా మామయ్య?" అని శ్రీధర్ సీరియస్ అవుతాడు. స్వప్న రావడంతో ఇద్దరూ సైలెంట్ అవుతారు.

కార్తీక్ తండ్రిపై ఆవేదన

కార్తీక్, శివన్నారాయణల మధ్య చర్చ తీవ్రమవుతుంది. కార్తీక్, "మా నాన్న మమ్మల్ని మోసం చేస్తే అమ్మకు భరోసా ఇచ్చావా? కూతురి మీద ప్రేమ ఎందుకు లేదు?" అంటూ తన తాతను నిలదీస్తాడు. రెండు కుటుంబాలను కలపడానికి మావయ్య (అనసూయ భర్త) చేసిన ప్రయత్నాలు కూడా అత్త అనుమానాలతో చెడిపోయిందని కార్తీక్ అంటాడు.

దశరథ్-సుమిత్రలను కలపడానికి తన వద్ద ప్లాన్ ఉందని శివన్నారాయణ కార్తీక్‌తో చెబుతారు. అటు, శౌర్యకు చెల్లి కావాలని కోరిక తెలుపుతుంది. తదుపరి ఎపిసోడ్‌లో శివన్నారాయణ ప్లాన్ ఏమిటి? కాశీ నిజం స్వప్న ముందు బయట పడుతుందా? అనేది చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+