Karthika deepam 2 September 12 Episode:జ్యోత్స్నకు వంటలక్క షాక్..!!
కార్తీకదీపం సీరియల్ తెలుగు ప్రజలను ఆకట్టుకుంటోంది.రోజుకో ట్విస్టుతో సాగుతూ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే... దశరథ, సుమిత్రల మధ్య గొడవ కొనసాగుతూనే ఉంది. సుమిత్ర చేసిన తప్పు వల్ల తన చెల్లి కాంచన దగ్గర తల దించుకోవాల్సి వస్తోందని దశరథ తండ్రి శివ నారాయణతో బాధపడతాడు. సుమిత్ర క్షమాపణలు చెబితేనే ఆమెతో మాట్లాడతానని తెగేసి చెబుతాడు. మరోవైపు, దీపా, కార్తీక్‌లపై పగతో రగిలిపోతున్న జ్యోత్స్నకు దాసు ఫోన్ చేసి, కాశీ ప్రమాదంలో ఉన్నాడని చెబుతాడు. కాశీని విడిపించమని దాసు వేడుకోగా, తాను చూసుకుంటానని జ్యోత్స్న హామీ ఇస్తుంది. కానీ, గౌతమ్ విషయంలో కాశీ తనకు మోసం చేశాడని గుర్తు చేసుకుని, యాక్సిడెంట్ అయిన వ్యక్తిని చంపేసి కాశీని శాశ్వతంగా జైలుకు పంపాలని కుట్ర పన్నుతుంది.
సెప్టెంబర్ 12,ఎపిసోడ్ 461:
కాశీ జైలులో ఉండటంతో దిల్, కావేరి కంగారుపడతారు. వారిని ఇంటిలోనే ఉంచి బయటకు వెళ్ళిన శ్రీధర్‌పై వారు మండిపడతారు. అదే సమయంలో, కాశీతో కలిసి దాసు ఇంటికి రావడంతో అందరూ ఆశ్చర్యపోతారు. శ్రీధర్ తనను కాపాడాడని కాశీ చెప్పడంతో దిల్, కావేరి ఆనందిస్తారు. సమస్య పూర్తిగా తీరే వరకు బయటకు వెళ్ళవద్దని శ్రీధర్ వారికి సలహా ఇస్తాడు. మరోపక్క, కార్తీక్, దీపాలు శౌర్యను శివ నారాయణ ఇంటికి తీసుకెళ్తారు. అక్కడ శౌర్యను చూసి దశరథ, సుమిత్ర ఆప్యాయంగా మాట్లాడుకుంటారు.

సుమిత్ర గది దగ్గర వారి మాటలు వింటున్న దీపాను జ్యోత్స్న చూస్తుంది. బలవంతంగా ఆమెను లోపలికి తీసుకెళ్లి సుమిత్రకు దీపాపై చాడీలు చెబుతుంది. అయితే సుమిత్ర జ్యోత్స్నపై తీవ్రంగా కోపపడుతుంది. "నాకు, దీపాకు మధ్య జరిగే విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు, లేకపోతే దెబ్బలు పడతాయి" అని హెచ్చరిస్తుంది. కంపెనీ నష్టాలను సరిదిద్దడంపై దృష్టి పెట్టమని సలహా ఇస్తుంది.
సుమిత్ర గదిలోంచి బయటకు వచ్చిన జ్యోత్స్నకు దీపా మరో షాక్ ఇస్తుంది.కార్తీక్‌ను కట్టమని గతంలో జ్యోత్స్న తెచ్చిన తాళిబొట్టును ఆమె చేతిలో పెడుతుంది. "దీని కోసమే కదా ఇన్నాళ్లు పోరాడింది, తీసుకో" అని దీపా అనడంతో జ్యోత్స్న కోపంతో రగిలిపోతుంది. అందరి సంగతి చూస్తానని హెచ్చరిస్తుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది తదుపరి ఎపిసోడ్‌లో చూడాల్సిందే.












Click it and Unblock the Notifications