Karthika deepam 2 September 13 Episode:జోత్స్నకు దీపా ట్విస్ట్ - కార్తీక్ పై సందేహం
కార్తీక దీపం సీరియల్ తెలుగింటి వారి ఫేవరెట్ సీరియల్‌గా కొనసాగుతోంది. ముఖ్యంగా మహిళలైతే ఈ సీరియల్ వస్తున్న సమయంలో ఎంత ముఖ్యమైన పని ఉన్నా పక్కకు పెట్టడమో లేక వాయిదా వేసుకోవడమో చేస్తున్నారు. ఇక గత ఎపిసోడ్‌లో కాశీ ప్రమాదం నుంచి శ్రీధర్ అతడిని కాపాడటం, దీపా జ్యోత్స్నకు తాళిబొట్టు తిరిగి ఇవ్వడం చూశాం. తమ అల్లుడిని శ్రీధర్ కాపాడాడని తెలిసి దిల్, కావేరి ఆశ్చర్యపోయారు. ఇక జ్యోత్స్న పగతో రగిలిపోయింది. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 13వ తేదీన 462వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది.
తాజా ఎపిసోడ్ (సెప్టెంబర్ 13)లో..
దీపా తన తాళిబొట్టును తిరిగి ఇవ్వడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. పైగా, సుమిత్ర కూడా దీపాకు మద్దతుగా మాట్లాడటం చూసి ఆమెకు మరింత కోపం వస్తుంది. జ్యోత్స్న బయటికి రాగానే కార్తీక్ బాబు ఎదురై ఆమె చేతిలో ఉన్న తాళిని చూసి నవ్వుతాడు. "నీ సలహాల వల్లే దీపా ఇలా చేసింది" అని జ్యోత్స్న మండిపడగా, "దీపా ఇంకా ఏదేదో ఇచ్చినట్టు ఉంది కదా?" అని కార్తీక్ నవ్వుతూ అంటాడు.

కార్తీక్, దీపాల ముందు తాను చిన్నబోతున్నానని, వారిద్దరి అంతు చూస్తానని జ్యోత్స్న బెదిరిస్తుంది. దానికి కార్తీక్, "త్వరలో మీరు ఊహించని ఘటనలు జరుగుతాయి, నేను దేని గురించి మాట్లాడుతున్నానో త్వరలోనే తెలుస్తుంది" అని ఒక ట్విస్ట్ ఇస్తాడు. అయితే, కార్తీక్ ప్రవర్తన అర్థం చేసుకోలేక, అతను రెస్టారెంట్ సీఈవో పదవి కోసం తమ కుటుంబాన్ని దూరం చేస్తున్నాడని జ్యోత్స్న అనుమానం వ్యక్తం చేస్తుంది.
"నాకు సీఈవో కావాలనే ఆశ ఉంటే ఎప్పుడో సాధించేవాడిని" అని నవ్వుతూ కార్తీక్ చెప్పి వెళ్ళిపోతాడు. మరోవైపు, శౌర్య చాక్లెట్ బాక్స్‌ను దొంగలించిన పారుజాతంను శివ నారాయణ మందలించి, శౌర్యకు తిరిగి ఇప్పిస్తాడు.
ఇక అందరినీ ఆశ్చర్యపరుస్తూ శ్రీధర్ పూర్తిగా మారిపోతాడు. కాశీకి ఇంటర్వ్యూకు వెళ్ళడానికి డబ్బులు ఇచ్చి ప్రోత్సహిస్తాడు. తండ్రి మారిన తీరు చూసి దిల్ కన్నీళ్లు పెట్టుకుంటుంది. "నాన్న మారడని తెలియక పశువు అని నోటికొచ్చినట్టు తిట్టాను" అని బాధపడుతుంది. శ్రీధర్ ఇలా మారడానికి కారణం కార్తీక్ బాబునే అయి ఉంటాడని దిల్ నమ్ముతుంది. తర్వాతి ఎపిసోడ్‌లో ఏమి జరగబోతుందో ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications