Karthika deepam 2 September 19 Episode:ఈ ఫోటోలో వ్యక్తే నా ప్రాణదాతన్న కార్తీక్..షాక్‌లో సుమిత్ర..!

తెలుగునాట విజయవంతంగా దూసుకెళుతోన్న కార్తీకదీపం 2 సీరియల్ నిన్నటి ఎపిసోడ్‌లో, శౌర్య పుట్టినరోజు వేడుకలు కార్తీక్ ఇంట్లో ఘనంగా జరుగుతాయి. అయితే, జ్యోత్స్న కార్తీక్‌ను ఉద్దేశించి "శౌర్య పాప నీ కన్న కూతురు కాదు, నువ్వు చేసేది సోషల్ సర్వీస్" అని మాట్లాడి అందరినీ షాక్‌కు గురిచేస్తుంది. జ్యోత్స్న మాటలకు పారిజాతం గట్టిగా బదులిస్తుంది. "కొందరికి రక్త సంబంధం లేకపోయినా అంతకంటే గొప్ప బంధం ఉంటుంది" అని చెప్పి జ్యోత్స్నను దెప్పిపొడుస్తుంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 19న ప్రసారమైన 467వ ఎపిసోడ్ ఉత్కంఠగా సాగింది.

తాజా ఎపిసోడ్ (సెప్టెంబర్ 19)లో..
జ్యోత్స్న మాటలపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేయగా, దశరథ మాట్లాడుతూ "ఒకరి జీవితం పట్ల బాధ్యత తీసుకున్న వారికే ప్రశ్నించే అర్హత ఉంటుంది" అని చెప్పి కార్తీక్‌కు మద్దతుగా నిలుస్తాడు. ఆ తర్వాత సుమిత్ర, కార్తీక్‌కు తాను ఇంతకు ముందు పెట్టిన 'ప్రాణదాతను చూపించాలి' అనే కండిషన్‌ను గుర్తు చేస్తుంది.

Karthika deepam 2 Serial September 19 2025 Episode 467 Here is the Today s full story

దానితో కార్తీక్, తన ప్రాణదాత ఎక్కడో లేరని, ఇక్కడే మన దగ్గరే ఉన్నారని చెబుతాడు. సుమిత్ర కళ్ళు మూసుకోవాలని చెప్పి, ఆమె చేతిలో దీప చిన్నప్పటి ఫోటోను పెడతాడు. ఆ ఫోటో చూసిన సుమిత్ర, "నువ్వు కోనేరులో పడిపోయినప్పుడు నిన్ను కాపాడింది ఈ అమ్మాయే" అని గుర్తుపడుతుంది. అది విన్న వెంటనే కార్తీక్, తన ప్రాణదాత దీపనేనని చెబుతాడు. సుమిత్ర ముందు దీపను నిలబెట్టి, ఆమె చేతిని సుమిత్ర చేతిలో ఉంచుతాడు.

కళ్ళకు అడ్డంగా చేతులు పెట్టుకొని ఉన్న సుమిత్ర కళ్ళు తెరిచి చూడగా, ఎదురుగా దీపను చూసి షాక్ అవుతుంది. "కార్తీక్, నీ ప్రాణదాత దీప అయి ఉండదు, నీ భార్యను కాపాడుకోడానికి ఇలా అబద్ధం చెబుతున్నావు" అని ఆమె అరుస్తుంది. అందుకు కార్తీక్, "నేను చెప్పింది నమ్మండి, నేను అబద్ధం చెప్పడం లేదు" అని నిరూపించడానికి దీప బాల్యంలోని ఫోటోను, మరో ఫోటోను చూపిస్తాడు. రెండు ఫోటోలలో ఉన్నది ఒకరే అని నమ్మిన సుమిత్ర ఎంతో భావోద్వేగానికి గురవుతుంది. తన మేనల్లుడిని కాపాడింది దీపనేనని తెలిసి ఆమె కళ్ళల్లో ఆనందం నిండిపోతుంది. నా చేతులతో నేను ప్రత్యేకంగా నీకు లాకెట్ వేస్తానని సుమిత్ర అంటుంది. కార్తీక్ బాబు సుమిత్రను మరో కండిషన్ అడిగి, దీపను క్షమించాలని కోరతాడు. దీనికి సుమిత్ర ఎలా స్పందించనుందనే దానిపై తర్వాతి ఎపిసోడ్‌పై ఉత్కంఠ పెరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+