Karthika deepam 2 September 26 Episode:దీప పై నింద..కార్తీక్ బాబు సమాధానం ఇదే..!!
కార్తీక దీసం 2 సీరియల్‌లో గత ఎపిసోడ్‌లో, చేయని తప్పును ఒప్పుకోవాలని సుమిత్ర ఒత్తిడి చేయడంతో దీప "అవును" అని షాకింగ్‌గా సమాధానం ఇచ్చింది. అయితే కార్తీక్ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించి, దీపను ఇంటికి తీసుకెళ్లిపోతాడు. దీప తప్పు ఒప్పుకోవడం ద్వారా కుటుంబం కలిసిపోయే అవకాశాన్ని కార్తీక్ పాడుచేశాడని శ్రీధర్ అతడితో గొడవ పడతాడు. ఈ నాటకీయ పరిణామాల తర్వాత, సెప్టెంబర్ 26న ప్రసారమైన 473వ ఎపిసోడ్ ఉత్కంఠగా సాగింది.
తాజా ఎపిసోడ్ (సెప్టెంబర్ 26)లో..
ఉదయాన్నే శౌర్య స్కూల్‌కి వెళ్లనని కార్తీక్‌తో చెప్పడంతో అతను ఆశ్చర్యపోతాడు. స్కూల్‌లో స్నేహితులు అవమానించారని, తల్లిదండ్రులు హోంవర్క్ చేయించడం లేదని శౌర్య బాధపడుతుంది. ఈ సమయంలో జ్యోత్స్న కార్తీక్‌కి ఫోన్ చేసి "నిన్న జరిగిన అవమానానికి నువ్వు మా ఇంటికి రాలేవు కాబట్టి అగ్రిమెంట్ ప్రకారం రూ.10 కోట్లు పంపించు" అని వ్యంగ్యంగా అడుగుతుంది. దీప గురించి మాట్లాడే జ్యోత్స్నను శౌర్య అడ్డుపెట్టుకుని కార్తీక్ తిప్పి కొడతాడు. జ్యోత్స్న మాటలకు దీప బాధపడగా, "మనం ఎవరి గురించి పట్టించుకోకూడదు" అని కార్తీక్ ఆమెకు ధైర్యం చెబుతాడు.

అనసూయతో కలిసి దీప, కార్తీక్ తిరిగి శివ నారాయణ ఇంటికి పనికి వస్తారు. వారిని చూసిన శివ నారాయణ, "మీరు ఇకపై ఇక్కడ పనిచేయాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోండి" అని తేల్చి చెబుతాడు. కార్తీక్ ప్రశ్నించగా, "మీ వల్ల మా ఇంట్లో సమస్యలు వస్తున్నాయి" అని అంటాడు. పారిజాతం కార్తీక్‌ను సెటైర్లతో అవమానించగా, "నా భార్య తప్పు చేసింది అని మీరు నమ్ముతున్నారా?" అని కార్తీక్ ప్రశ్నిస్తాడు. శ్రీధర్ కూడా కార్తీక్‌కు మద్దతు ఇవ్వడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలవుతుంది.
శివ నారాయణ "దీపను ఇంట్లో దించి నువ్వు రా" అని కార్తీక్‌తో చెప్పగా, జ్యోత్స్న కలుగజేసుకుంటుంది. "మీరు ఎంత చెప్పినా వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళరు. వాళ్ళ ఆత్మాభిమానం చాలా పెద్దది" అని వెక్కిరిస్తుంది. పారిజాతం నిన్న రాత్రి జరిగిన గొడవ గురించి చెబుతూ, "ఈ సమస్యలన్నీ మీ వల్లే వచ్చాయి" అని దీపపై నింద వేస్తుంది.
ఇంతలో దీప "నా వల్లే ఈ సమస్యలు వస్తున్నాయి, నేనే వెళ్లిపోతాను" అని నిర్ణయించుకుంటుంది. కానీ కార్తీక్ "ఇది మన ఇల్లు. సమస్యను మనం పరిష్కరించాలి" అని చెబుతాడు. ఈ క్రమంలో దీప దశరథతో మాట్లాడి, సుమిత్రను క్షమించమని వేడుకుంటుంది. ఈ మాటలు విన్న జ్యోత్స్న, "నాన్నను ఎదిరించినందుకు నాకు దెబ్బలు పడ్డాయి. ఆ తప్పంతా ఈ దీపదే" అని సుమిత్రతో అంటుంది. అది విని సుమిత్ర, "దీప చెప్పిన దాంట్లో తప్పు లేదు" అని చెప్పి జ్యోత్స్నకు షాక్ ఇస్తుంది. దీనితో తర్వాతి ఎపిసోడ్‌పై ఉత్కంఠ పెరిగింది.












Click it and Unblock the Notifications